ScienceAndTech

ఐఐటీ మద్రాస్‌కు ప్రథమ స్థానం-తాజావార్తలు

ఐఐటీ మద్రాస్‌కు ప్రథమ స్థానం-తాజావార్తలు

* దేశంలో ఉత్తమ యూనివర్సిటీ జాబితాల్లో ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ (NIRF) 2021 సంవత్సరానికి గానూ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్‌ టాప్‌ స్థానంలో నిలిచింది. అన్ని విభాగాలతో పాటు ఇంజినీరింగ్‌ కేటగిరీలోనూ తొలిస్థానం సాధించింది. ఐఐటీ మద్రాస్‌ ఈ ఘనతను సాధించడం వరుసగా ఇది మూడోసారి. 

* శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 17 నుంచి తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది . ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొంది . కరోనా నేపథ్యంలో రోజుకు 15 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది . దర్శనం కోసం భక్తులు ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించింది . అటు , కేరళలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం గమనార్హం .

* ద‌క్క‌న్ ముద్ర‌ గ్రూపుపై మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ‌కు చెందిన యువ‌త కొంద‌రు వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టార‌ని, ద‌క్క‌న్ ముద్ర‌ గ్రూపును స్థాపించి.. తెలంగాణ సోనా బియ్యాన్ని ఆ గ్రూపు ప్ర‌త్యేక ప్యాకెట్ల‌లో అమ్ముతోంద‌న్నారు. తెలంగాణ సోనా బియ్యంలో గైసిమెక్స్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని, ఇది డ‌యాబెటిక్స్ రోగుల‌కు మంచిద‌ని, ఇలాంటి బియ్యాన్ని మార్కెట్లోకి తెచ్చిన ద‌క్క‌న్ గ్రూపున‌కు బెస్ట్ విషెస్ చెబుతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. అయితే ఈ త‌రానికి చెందిన ఈ బియ్యాన్ని .. ప్రొఫెష‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ వ‌ర్స‌టీలో శాస్త్ర‌వేత్త‌లు ఇన్‌హౌజ్‌లో డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

* ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ జీవిత‌చ‌రిత్ర ( Sourav Ganguly biopic ) తెర‌కెక్క‌నుంది. ల‌వ్ ఫిల్మ్స్ ( Luv Films ) ఈ మూవీని తెర‌కెక్కించ‌నుంది. మ‌హారాజ ఆఫ్ ఇండియ‌న్ క్రికెట్‌గా పేరుగాంచిన ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ బ‌యోపిక్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌తంలో త‌న బ‌యోపిక్‌కు దాదా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాను తామే నిర్మిస్తున్నట్లు ల‌వ్ ఫిల్మ్స్ గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఇది త‌మ‌కు గొప్ప గౌర‌వ‌మ‌ని, గ్రేట్ ఇన్నింగ్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పింది.

* ఆస్తుల న‌గ‌దీక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తొలి అడుగు వేసింది. దేశంలోని 13 ఎయిర్‌పోర్ట్‌ల‌ను ప్రైవేటీక‌రించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తుది అనుమ‌తి ఇచ్చింది. నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైప్‌లైన్‌లో భాగంగా 2024 ఆర్థిక సంవ‌త్స‌రం నాటికి ఎయిర్‌పోర్ట్‌ల‌లో రూ.3660 కోట్ల ప్రైవేట్ పెట్టుబ‌డుల‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. 13 ఎయిర్‌పోర్ట్‌ల‌లో ఆరు మేజ‌ర్ ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి.

* అంత‌ర్జాతీయ‌ అంత‌రిక్ష కేంద్రంలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంతో అంత‌రిక్ష కేంద్రంలో పొగ వ్యాపించి.. దాంతో స్మోక్ అలార‌మ్‌లూ మోగాయి. ఈ ఘ‌ట‌న స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న ర‌ష్యా మాడ్యూల్‌లో జ‌రిగింది. జ్వెజ్‌దా మ్యాడూల్‌లోనే ఆస్ట్రోనాట్లు నివ‌సించే క్వార్ట‌ర్లు ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో అంత‌రిక్ష కేంద్రంలో వ‌రుస‌గా ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. కాలం చెల్లిన హార్డ్‌వేర్, సిస్ట‌మ్స్ నిర్జీవం కావ‌డ‌మే కార‌ణ‌మ‌ని ఓ ర‌ష్యా అధికారి ఇటీవ‌ల వార్నింగ్ ఇచ్చారు. అయితే అన్ని సిస్ట‌మ్స్ మ‌ళ్లీ సాధార‌ణ స్థాయికి వ‌చ్చిన‌ట్లు రాస్కాస్మోస్ స్పేస్ ఏజెన్సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

* రాజ్య‌స‌భ స‌భ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టిక‌ర్త జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌పై రామోజీ గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంతోష్ కుమార్.. ఈ ఏడాది సీడ్ గ‌ణేశా విగ్ర‌హాల‌ను పంపిణీ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ఈ సీడ్ గ‌ణేశా ప్ర‌తిమ‌ల‌ను పంపించారు. విత్త‌న గ‌ణ‌ప‌య్య ప్ర‌తిమ‌లు అద్భుత‌మంటూ ఎంపీ సంతోష్ కుమార్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ సంద‌ర్భంగా సంతోష్‌కుమార్‌ను రామోజీరావు ప్ర‌శంసిస్తూ, ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ మేర‌కు రామోజీరావు ఓ లేఖ విడుద‌ల చేశారు.