Devotional

దుర్యోధనుడి కుమార్తెను వివాహమాడిన కృష్ణుని కుమారుడు తెలుసా?

దుర్యోధనుడి కుమార్తెను వివాహమాడిన కృష్ణుని కుమారుడు తెలుసా?

దుర్యోధనుని కూతురు లక్ష్మణను పెండ్లిచేసుకొన్న శ్రీకృష్ణుని కొడుకు ఎవరో మరి.
………………………………………………..

శ్రీకృష్ణుణుకి ఎనిమిది మంది భార్యలు. వారిపేర్లు (1) రుక్మిణి, (2) సత్యభామ, (3) జాంబవతి, (4) నగ్నజితి, (5) కాళింది, (6) మిత్రవింద, (7) భద్ర, (8) లక్ష్మణ. వీరినే అష్టభార్యలంటారు.

శ్రీకృష్ణుడి అష్టభార్యలకు ప్రతి ఒక్కొక్కరికి పదిమంది కొడుకులు జన్మించారు.
వారెవరంటే

పట్టపుమహిషి రుక్మిణిదేవికి శ్రీకృష్ణునికి (1) ప్రద్యుమ్నుడు, (2) చారుదేష్ణుడు, (3) సుదేష్ణుడు, (4) చారుదేహుడు, (5) సుబారుడు, (6) చారుగుప్తుడు, (7) భద్రకారుడు, (8) చారుచంద్రుడు, (9) విచారుడు, (10) చారుడు అనే కొడుకులు కలిగారు.

వీరిలో ప్రద్యుమ్నుడి సంతానమే శ్రీకృష్ణుని వారసులుగా ద్వారకనేలుతారు.

సత్యభామ వల్ల కృష్ణునికి (1) భానుడు, (2) సుభానుడు, (3) స్వర్భానుడు, (4) ప్రభానుడు, (5) భానుమంతుడు, (6) చంద్రభానుడు, (7) బృహద్భానుడు, (8) అతిభానుడు, (9) శ్రీభానుడు, (10) ప్రతిభానుడు అనువారు కలిగారు.

జాంబవతీ శ్రీకృష్ణులకు (1) సాంబుడు, (2) సుమిత్రుడు, (3) పురజిత్తు, (4) శతజిత్తు, (5) సహస్రజిత్తు, (6) విజయుడు, (7) చిత్రకేతుడు, (8) వసుమంతుడు, (9) ద్రవిడుడు, (10) క్రతువు కలిగారు.

సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను స్వయంవరంలో అపహరించి, కౌరవులతో పోరాడి ఓడి బందీగాదొరికి పెదనాన్న బలరాముడి ద్వారా విడుదలైతాడు. దుర్యోధనచక్రవర్తి తన గురువు బలరాముడి మాటలను గౌరవించి సాంబుడికి తన కుమార్తె లక్ష్మణను ఇచ్చి పెండ్లిచేశాడు.ఇలా శ్రీకృష్ణదుర్యోధనులు వియ్యంకులైనారు.

సాంబుడు అతని సహచరులు దుర్వాసుని గేలి చేయడం వలన ఆ మహముని శాపంతో సాంబుడి కడుపున ముసలం (రోకలి ) పుట్టి అశేషంగా యదువంశం నశిస్తుంది.

నాగ్నజితి, శ్రీకృష్ణులకు (1) వీరుడు, (2) చంద్రుడు, (3) అశ్వసేనుడు, (4) చిత్రగుడు, (5) వేగవంతుడు, (6) వృషుడు, (7) లముడు, (8) శంకుడు, (9) వసుడు, ( 10 ) కుంత అనువారు కలిగారు.

శ్రీకృష్ణుడికి కాళింది వలన (1) శ్రుతుడు, (2) కవి, (3) వృషుడు, (4) వీరుడు, (5) సుబాహుడు, (6) భద్రుడు, (7) శాంతి, (8) దర్శుడు, (9) పూర్ణమానుడు, (10) శోమకులు జన్మించారు.

లక్షణకు, శ్రీకృష్ణుడికి (1) ప్రఘోషుడు, (2) గాత్రవంతుడు, (3) సింహుడు, (4) బలుడు, (5) ప్రబలుడు, (6) ఊర్ధ్వగుడు, (7) మహాశక్తి, (8) సహుడు, (9) ఓజుడు, (10) అపరాజితుడు అనేవారు కలిగారు.

మిత్రవింద, శ్రీకృష్ణులకు (1) వృకుడు, (2) హర్షుడు, (3) అనిలుడు, (4) గృద్ధుడు, (5) వర్ధనుడు, (6) అన్నడు, (7) మహాశుడు, (8) పావనుడు, (9) వహ్ని, (10) క్షుధి పుట్టారు.

శ్రీకృష్ణ భద్రలకు (1) సంగ్రామజిత్తు, (2) బృహత్సేనుడు, (3) శూరుడు, (4) ప్రహరణుడు, (5) అరిజిత్తు, (6) జయుడు, (7) (9) సుభద్రుడు, (8) వాముడు, ఆయువు, (10) సత్యకుడు అనేవారు కలిగారు.

శ్రీకృష్ణుడికి అష్టభార్యల వలన కలిగిన కొడుకుల సంఖ్య > 80.