ScienceAndTech

వికారాబాద్‌లో డ్రోన్లతో మందుల పంపిణీ-తాజావార్తలు

వికారాబాద్‌లో డ్రోన్లతో మందుల పంపిణీ-తాజావార్తలు

* వికారాబాద్ జిల్లా కేంద్రంలో దేశంలోనే మొదటి సారిగా మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా,రాష్ట్ర మున్సిపల్, ఐ టి,పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

* వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాయి. ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు, అభ్యర్థుల జాబితాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాహుబలులు, మాఫియా నేతలకు తమ పార్టీ నుంచి టికెట్‌ ఇచ్చేదే లేదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ గ్యాంగ్‌స్టర్‌ ముక్తార్‌ అన్సారీకి తమ పార్టీ తరపున మరోసారి టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకునే అంశంపై తమ పార్టీ ‘ఓపెన్‌ మైండెడ్‌’ గానే ఉందని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. అంతేకాకుండా కూటమిగా ఏర్పడటాన్ని తోసిపుచ్చలేనని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో 403 సీట్లలో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగుతుందా? లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు ప్రియాంక గాంధీ ఈ విధంగా జవాబిచ్చారు.‘వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం.. కూటమిగా ఏర్పడటాన్ని నేను తోసిపుచ్చను. అయితే, దీనిపై ఇప్పుడే ప్రకటన చేయడం తొందరపాటే అవుతుంది. కచ్చితంగా మేము పట్టుదలకు పోము. విశాల దృక్పథంతో ఉంటాం’ అని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. భాజపాను ఓడించడమే తమ లక్ష్యం అన్న ప్రియాంక గాంధీ ఈ విషయంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓపెన్‌ మైండెడ్‌గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక తనను రాజకీయ టూరిస్టుగా అభివర్ణిస్తోన్న భాజపాపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. కేవలం నాతోపాటు నా సోదరుడు రాహుల్‌ గాంధీని ప్రభావం లేని రాజకీయ నాయకులుగా చిత్రీకరించేందుకే భాజపా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

* దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి సింధియా శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గౌరవార్ధం.. సీఎం కేసీఆర్ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు.

* ప్రపంచంలోనే ఎత్తైన అమెరికాకు చెందిన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (World Trade Center) జంట భవనాలపై ఉగ్రవాదులు అమానుషంగా దాడికి దిగిన సంఘటన 2001 లో సరిగ్గా ఇదే రోజున జరిగింది. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా పరిగణించబడుతున్నది. ఈ దాడిలో 93 దేశాలకు చెందిన దాదాపు 3000 మంది దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్‌, లెబనాన్‌కు చెందిన 19 మంది ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్‌ చేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ తెలిపింది. ఎప్పటిలాగే అమెరికాలో ప్రజలు తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట టవర్లలో కూడా దాదాపు 18,000 వేల మంది వారివారి విధుల్లో ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల కార్యాలయాలు ఈ జంట టవర్లలో ఉన్నాయి. సరిగ్గా ఉదయం 8.45 నిమిషాలకు ఒక్కసారిగా ఉత్తరం దిశలోని టవర్‌లోకి బోయింగ్‌ 767 విమానం పెద్దగా శబ్ధం చేస్తూ చొచ్చుకున వచ్చి పేలిపోయింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు, దుమ్ము ధూళి ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఎంత మంది చనిపోయారో తెలియదు. గాయాలకు గురైన వారి హాహాకారాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో మరో విమానం రెండో టవర్‌ను బలంగా ఢీకొని పేలిపోయింది. ఇది జరిగిన కొన్ని నిమిషాలకు మరో రెండు విమానాల్లో ఒకటి పెంటగాన్‌పై కుప్పకూలగా.. ఇంకొకటి షాంక్‌విల్లే ఫాంలో కుప్పకూలిపోయింది. ఒక్క పెంటగాన్‌ ఘటనలోనే 184 మంది చనిపోయినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ విమానాల దాడులకు ప్రధాన సూత్రధారిగా అల్‌ ఖాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అని అమెరికా వెల్లడించింది. ఈ విమానాల దాడుల అనంతరం లాడెన్‌ ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా లాడెన్‌ నిలిచారు. బిన్ లాడెన్‌ను సజీవంగా లేదా చంపి తీసుకురావడానికి అమెరికా 25 మిలియన్ డాలర్ల బహుమతిని అందించింది. తుదకు 2011 మే 2 న పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ఓ ఇంట్లో దాక్కున్న బిన్ లాడెన్‌ను రహస్య మిషన్‌లో అమెరికా చంపేసింది.

* న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ( Saidharam Tej ) స్పృహ‌లోకి వ‌చ్చాడు. నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి వ‌ద్ద బైక్‌పై వెళ్తున్న సాయిధ‌ర‌మ్ తేజ్ కింద ప‌డిపోవ‌డంతో.. అత‌ని ఛాతీకి బ‌ల‌మైన గాయాల‌య్యాయి. దీంతో అత‌న్ని జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. శ‌నివారం సాయంత్రం సాయిధ‌ర‌మ్ తేజ్ స్పృహ‌లోకి వ‌చ్చిన‌ట్లు అపోలో వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు. స్పృహ‌లోకి వ‌చ్చిన సాయి ఒకే ఒక మాట మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. నొప్పిగా ఉంద‌ని సాయి చెప్పిన‌ట్లు స‌మాచారం. సాయిధ‌ర‌మ్ తేజ్‌కు డాక్ట‌ర్ అలోక్ రంజ‌న్ బృందం చికిత్స అందిస్తోంది.

* స‌మాజానికి, ప్రకృతికి మేలు చేకూర్చే అట‌వీ సంప‌ద‌ను ర‌క్షించేందుకు అట‌వీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నార‌ని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అట‌వీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జూ పార్కు వ‌ద్ద స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహ‌ణ‌లో అమ‌రుల‌య్యార‌ని, ఇది చాలా బాధాకరమని అన్నారు. అటవీ సంప‌ద‌ను కాపాడ‌టంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

* ప్రతిష్ఠాత్మక యూఎస్‌ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జర్మనీ ప్లేయర్‌, నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో హోరాహోరీగా సాగిన సెమీస్‌లో 4-6, 6-2, 6-4, 4-6, 6-2తో గెలుపొందాడు. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (జర్మనీ)తో పోటీ పడనున్నాడు.

* బీజేపీ పాలిత గుజ‌రాత్ రాష్ట్రంలో ఇవాళ అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య్‌ రూపానీ త‌న ప‌ద‌వివి రాజీనామా స‌మ‌ర్పించారు. అనంత‌రం బీజేపీ గుజ‌రాత్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి భూపేంద్ర యాద‌వ్ రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్‌ను క‌లిశారు. ఈ రెండు ప‌రిణామాలు చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. నూత‌న నాయ‌కత్వానికి అవ‌కాశం ఇవ్వ‌డం కోస‌మే తాను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాన‌ని విజ‌య్ రూపానీ చెబుతున్నా, అస‌లు కార‌ణం మాత్రం వేరేలా ఉన్న‌దని తెలుస్తున్న‌ది.వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో గుజ‌రాత్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో.. ప‌టేల్ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని ముఖ్య‌మంత్రిని చేసి అత‌ని నేతృత్వంలో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బీజేపీ హైక‌మాండ్‌ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు నూతన సీఎం రేసులో మొత్తం న‌లుగురు నేత‌లు ఉన్నార‌నే ప్ర‌చారం కూడా జోరుగా జ‌రుగుతున్న‌ది. మ‌న్సుక్ మాండ‌వీయ‌, నితిన్ ప‌టేల్‌, సీఆర్ పాటిల్‌, పురుషోత్త‌మ్ రూపాలా కొత్త సీఎం రేసులో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. మ‌రి ఈ న‌లుగురిలో ఎవ‌రిని అదృష్టం వ‌రించ‌నుందో తెలియాలంటే.. బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణ‌యం చేసే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.కాగా, సీఎం రేసులో ఉన్న న‌లుగురిలో మ‌న్సుక్ మాండ‌వీయ ప్ర‌స్తుతం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌తోపాటు ర‌సాయ‌నాలు ఎరువుల శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్నారు. నితిన్ ప‌టేల్ 2016 నుంచి గుజ‌రాత్ ఉప ముఖ్య‌మంత్రిగా సేవ‌లు అందిస్తున్నారు. ఇక సీఆర్ పాటిల్ లోక్‌స‌భ్యుడిగా ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న 6,89,668 ఓట్ల రికార్డు మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక పురుషోత్త‌మ్ రూపాలా కూడా మోదీ ప్ర‌భుత్వంలో మ‌త్స్య, ప‌శుసంవ‌ర్ధ‌క‌, డెయిరీ శాఖ‌ల మంత్రిగా ప‌నిచేస్తున్నారు. ఈ న‌లుగురిలో అదృష్టం ఎవ‌రిని వ‌రిస్తుందో వేచి చూడాలి.