Business

ట్రూఅప్ పేరిట ₹3600కోట్ల రాబడి లక్ష్యం-వాణిజ్యం

ట్రూఅప్ పేరిట ₹3600కోట్ల రాబడి లక్ష్యం-వాణిజ్యం

* వినియోగదారులపై ట్రూఅప్‌ మోత- ఈ నెల నుంచే భారీ వసూళ్లు- 8 నెలల్లో 3,600 కోట్లు లాగడమే లక్ష్యం- ఇప్పటికే గుట్టుగా మరో రెండు చార్జీలు- ఏడాదిలోనే 6 వేల కోట్లకు చేరిన వడ్డనలు- ఇది రాష్ట్ర చరిత్రలో ప్రథమం- చుక్కలు చూపిస్తున్న కరెంటు బిల్లులు- కరోనా కాలంలో పిండేస్తున్న విద్యుత్‌ సంస్థలు★ రాష్ట్రంలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది.★ విద్యుత్‌ వినియోగంతో సంబంధం లేకుండా రకరకాల వడ్డనలతో విద్యుత్‌ సంస్థలు ప్రజలను పిండేస్తున్నాయి.★ ఒక్క ఏడాదిలోనే రూ.6 వేల కోట్లను అదనంగా వసూలు చేస్తున్నాయి.★ ఫలితంగా బిల్లులు ముట్టుకుంటేనే షాక్‌ కొడుతున్నాయి.★ నెలకో కొత్త నిర్ణయంతో విద్యుత్‌ బిల్లుల భారం ప్రజలపై నానాటికీ పెరిగిపోతోంది.★ ట్రూఅప్‌ పేరుతో ఈ నెల బిల్లుల్లో వేసిన అదనపు మొత్తం వాటిని భారీగా పెంచింది.★ ట్రూఅప్‌ చార్జీల పేరిట కరెంటు వినియోగదారుల నుంచి ఎనిమిది నెలల్లో రూ.3,660 కోట్లు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించిన విద్యుత్‌ సంస్థలు, ఈ నెలలోనే రంగంలోకి దిగిపోయాయి.★ బిల్లుల్లో అదనపు వసూలుకు శ్రీకారం చుట్టాయి. వినియోగించిన కరెంటుతో పనిలేకుండా అదనపు భారం వేయడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.★ 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్లపాటు విద్యుత్‌ సంస్థలకు వచ్చిన అదనపు ఖర్చులను ఇప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇటీవల అనుమతి ఇచ్చింది.★ దీంతో సెప్టెంబరులోనే మొదలు పెట్టి వచ్చే 8 నెలల వ్యవధిలో ఈ డబ్బులన్నీ వసూలు చేసుకోవాలని ఆ సంస్థలు నిర్ణయించాయి.★ ఎప్పుడో ఆరేళ్ల కిందటి ఖర్చులను ఇప్పుడు వసూలు చేసుకోవడం ఏమిటని వినియోగదారులు మండిపడుతున్నా, అధికారులు సమాధానం చెప్పడం లేదు.★ పాత ఖర్చుల వసూలుకు తమకు ఇప్పుడు అనుమతి వచ్చిందని, ఆ ప్రకారం వ్యవహరిస్తున్నామని సమర్థించుకుంటున్నారు.★ తమకు వచ్చే అదనపు ఖర్చులపై విద్యుత్‌ సంస్థలు ట్రూ అప్‌ పేరుతో ఏటా ఒక ఖర్చుల నివేదికను ఈఆర్‌సీకి సమర్పించి అదనంగా వసూలు చేసుకోవడానికి అనుమతి కోరతాయి.టీడీపీ ప్రభుత్వం తన హయాంలో ఈ ట్రూ అప్‌ నివేదికలు దాఖలు చేయవద్దని విధాన నిర్ణయం తీసుకుంది.★ విద్యుత్‌ సంస్థలకు ఏవైనా అదనపు ఖర్చులు వస్తే ప్రభుత్వపరంగా తాము భరిస్తామని, వినియోగదారులపై ఆ భారం వేయకూడదని నిశ్చయించింది.★ దీనితో విద్యుత్‌ సంస్థలు అప్పట్లో ఈ నివేదికలు దాఖలు చేయలేదు.జగన్‌ సర్కారు వచ్చాక ఆ ఐదేళ్ల కాలానికి సంబంధించిన ట్రూఅప్‌ నివేదికలను ఈఆర్‌సీ ముందు దాఖలు చేయించింది. వాటి కింద రూ.3,660 కోట్ల వసూలుకు నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం దక్షిణ ప్రాంత విద్యుత్‌ సంస్థ, కేంద్ర విద్యుత్‌ సంస్థల పరిధిలోని తొమ్మిది జిల్లాల వినియోగదారులపై వారు ఇప్పుడు వాడుతున్న కరెంటుపై యూనిట్‌కు రూ.1.23 చొప్పున అదనపు వడ్డింపు ఈ నెల నుంచే ప్రారంభించారు.★ కరెంటు బిల్లులో ట్రూ అప్‌ చార్జీని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు.★ తూర్పు ప్రాంత విద్యుత్‌ సంస్థ పరిధిలోని ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల వినియోగదారులపై మాత్రం యూనిట్‌కు 45 పైసల భారమే పడుతోంది.మరో రెండు వడ్డింపులు★ ట్రూఅప్‌ చార్జీల భారం ఈ నెలలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా. మరో రెండు వడ్డింపులు అంతకుముందే నిశ్శబ్దంగా జరిగిపోయాయి.1. ప్రతి కిలోవాట్‌ విద్యుత్‌ వాడకానికి రూ.పది అదనంగా వసూలు చేసుకోవడానికి విద్యుత్‌ సంస్థలకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. దీనిని ఈ ఏడాది ఏప్రిల్‌ నెల బిల్లు నుంచే వసూలు చేస్తున్నారు.2. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ విద్యుత్‌ సంస్థలకు వచ్చిన అదనపు ఖర్చులను.. యూనిట్‌కు అర్ధరూపాయికి మించకుండా జూలై నుంచి సెప్టెంబరు దాకా వసూలు చేసుకోవడానికి కూడా అనుమతి లభించింది.స్థిర చార్జీలు, కస్టమర్‌ చార్జీలు.. ఇలా రకరకాల పేర్లతో చేస్తున్న వసూళ్లకు తోడు ట్రూ అప్‌ చార్జీలు అదనంగా వచ్చి చేరాయి.గుంటూరు జిల్లాలో ఒక వినియోగదారుడికి గత నెలలో వచ్చిన కరెంటు బిల్లు రూ.328. ఇప్పుడు ట్రూ అప్‌ కింద రూ.146, అదనంగా స్థిర చార్జీలు, కస్టమర్‌ చార్జీలు కూడా పడడంతో మొత్తం బిల్లు రూ.562 అయింది. అంటే ఈ వినియోగదారుడికి ఏభై శాతం అదనంగా భారం పడినట్లయింది.అదే జిల్లాలో మరో వినియోగదారుడికి వాడకం బిల్లు రూ.737 ఉంటే ట్రూ అప్‌ రూ.266, మిగతా చార్జీలతో కలిపి మొత్తం బిల్లు రూ.1,100 దాటింది. ఇలా అన్ని చార్జీలూ కలిపి ఈ ఒక్క ఏడాదిలోనే విద్యుత్‌ వినియోగదారులపై రూ.6 వేల కోట్ల వరకూ అదనపు భారం పడనుందని విద్యుత్‌ నిపుణులు చెబుతున్నారు.

* ఉప‌యోగించిన‌ (సెకండ్ హ్యాండ్‌) కార్ల‌కు రుణాలు ఇవ్వ‌డానికి బ్యాంకులు ఆస‌క్తి చూపుతున్నాయి. భార‌త్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అధిక శాతంలో ఉన్నారు. అంద‌రూ డైర‌క్ట్‌గా కంపెనీ నుంచి షోరూమ్‌ల‌కు వ‌చ్చే కార్ల‌ను కొనేటంత‌ట స్థోమ‌తు ఉండ‌క పోవ‌చ్చు. కానీ త‌గిన బ‌డ్జెట్‌లో త‌మ‌కు న‌చ్చిన కంపెనీ కారును సొంతం చేసుకోవాల‌ని ఆశ మాత్రం ఉంటుంది. అలాగే స్వ‌ల్ప కాలానికి కారుని ఉప‌యోగించాల‌ని అనుకునే వారికి సెకండ్ హ్యాండ్‌కార్ల మార్కెట్లో కారు కొనుగోలు మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. ఇటువంటి కార్లు చౌక‌గా ల‌భిస్తాయ‌ని పేరు ఇప్ప‌టికే ఉంది. వినియోగ‌దారులు త‌మ బ‌డ్జెట్‌లో దొరికే కారులో షికారు చేయోచ్చు. భార‌త్‌లో ఉప‌యోగించిన (సెకండ్ హ్యాండ్‌) కార్ల అమ్మ‌కాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిణామాల‌తో చాలామంది ప్ర‌జా ర‌వాణా కంటే ప్రైవేట్ ర‌వాణాను క‌లిగి ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు. చాలా బ్యాంకులు ఆక‌ర్ష‌నీయ‌మైన ఒప్పందాలు, పోటీ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తుండ‌డంతో, ఉప‌యోగించిన కారు కొన‌డం సౌక‌ర్య‌వంతంగా, సుల‌భంగా మారింది. కారు కొన‌డం ఎప్పుడూ ఉత్సాహ‌క‌రంగా ఉంటుంది. చౌక‌గా ల‌భిస్తే ఇంకా ఆనందం మ‌రి. దీనికి కాస్త‌ ప‌రిశోధ‌నా, ప్ర‌ణాళిక చాలా అవ‌స‌రం. మీరు కారు కొనాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు, గ‌రిష్ట ఫీచ‌ర్ల‌తో టాప్‌-ఎండ్ మోడ‌ల్ కోసం చూడ‌డ‌మే కాకుండా మీ బ‌డ్జెట్‌కు స‌రిపోయే కారును తీసుకోవాలి.

* మీకు ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్ (ఓబీసీ)లో గానీ.. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో గానీ ఖాతా ఉందా.. వెంట‌నే మీ బ్యాంకు శాఖ‌ల‌ను సంప్ర‌దించి చెక్‌బుక్‌లు, ఏటీఎం కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ఎందుకంటే వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన చెక్‌బుక్‌లు చెల్ల‌వ‌ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

* ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం చివ‌రి మూడు క్వార్ట‌ర్ల‌లో భార‌త్ ఆర్ధిక వృద్ధి మ‌రింత వేగ‌వంత‌మ‌వుతుంద‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జులై, ఆగ‌స్ట్‌లో స్థూల ఆర్థిక సంకేతాలు తిరిగి పుంజుకోవ‌డంతో స‌త్వ‌ర వృద్ధి న‌మోద‌వుతుంంద‌ని అంచ‌నా వేసింది.

* వివిధ మోడ‌ల్ కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్ స‌హా మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ (ఎంవీపీ) కార్ల సేల్స్‌లో మారుతి సుజుకివే అధికం. సెడాన్ సెగ్మెంట్‌లో మాత్రం హోండా అమేజ్ వేరియంట్ టాప్‌లో ఉంది. గ‌త నెల‌లో దేశంలోక‌ల్లా కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి బాలెనోది తొలిస్థానం. 2020 ఆగ‌స్టుతో పోలిస్తే 46 శాతం వృద్ధి చెందింది. గ‌త నెల‌లో బాలెనో కార్లు 15,646 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. ఆల్టో మోడ‌ల్ కార్ల సేల్స్ మాత్రం 8 శాతం త‌గ్గాయి. 2020 ఆగ‌స్టులో 14,397 యూనిట్లు విక్ర‌యిస్తే, గ‌త నెల‌లో 13,236 కార్లు మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి.