Movies

అప్పుల రోజులను తలుచుకుని ఏడ్చిన రోజా

అప్పుల రోజులను తలుచుకుని ఏడ్చిన రోజా

ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్న రోజా.. ‘నాకు తెలిసినంతవరకూ చిన్నప్పటి నుంచి డబ్బు, భోజనం విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. మా నాన్నకు సినిమా అంటే ఎంతో ఇష్టం. నిర్మాతగా మారి ఆయన ఎంతో నష్టపోయారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఓ సినిమాతో నన్ను హీరోయిన్‌గా పరిచయం చేశారు. డైలాగ్స్‌, డ్యాన్స్ రాదని అందరూ నన్ను ఏడిపించేవాళ్లు. బాగా బాధపడ్డాను. ఆ సినిమా తర్వాత పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలనుకున్నా. కానీ, అందరూ నన్ను కామెంట్లు చేస్తుంటే తట్టుకోలేక నాన్న, అన్నయ్యలతో కలిసి ఫొటోషూట్‌ కోసం చెన్నై వెళ్లా. అక్కడే నాకు సెల్వమణి తెరకెక్కించిన ‘చామంతి’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. నా అదృష్టం కొద్ది ఆ తర్వాత మరలా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సెల్వమణితో పెళ్లి ఓకే అనుకున్నాక.. మా అన్నయ్య వాళ్లని సెటిల్‌ చేద్దామని ‘సమరం’ సినిమా చేశాను. మా జీవితాలు కూడా ఆ టైటిల్‌లాగే అయిపోయాయి. బాగా అప్పులైపోయాం. 2002 వరకూ కష్టపడిందంతా అప్పులు కడుతూనే ఉన్నాను. ఆ తర్వాత సెల్వతో నా వివాహం జరిగింది. పెళ్లికి ముందే నాకు పిల్లలు పుట్టరు అని చెప్పేశారు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాగా ఏడ్చాను. కానీ, కొంతకాలానికి పాప పుట్టింది. మా అమ్మాయిని దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. అదంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పి రోజా కన్నీరు పెట్టుకున్నారు.