Business

విప్రో ఉద్యోగులకు ముఖ్య గమనిక-వాణిజ్యం

విప్రో ఉద్యోగులకు ముఖ్య గమనిక-వాణిజ్యం

* ◆ AP లో అందుబాటులోకి వచ్చిన సర్కారు వారి చేపలు…!◆ విశాఖలోని పెడగంట్యాడలో ఫిష్ అవుట్ లెట్ ప్రారంభం.◆ రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్లు.◆ ఫిష్ అవుట్ లెట్లు కు చెరువు, సముద్ర చేపలు, రొయ్యలు, పీతలను సరఫరా చేయనున్న ప్రభుత్వం.◆ ఫిష్ అవుట్ లెట్లలో అందుబాటులోకి రానున్న వంజరం, చందువ, రొయ్యలు, పీతలు, పండుగప్ప, శీలావతి, బొచ్చ, కొర్రమీను, రాగండి,కట్ల, రూప్ చంద్, వంటి జల ఉత్పత్తులు.

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో న‌గ‌రంలోని ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ( Delhi Airport ) భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచింది. ర‌న్‌వేతోపాటు విమానాల‌ను నిలిపివుంచే స్థ‌లం కూడా పూర్తిగా నీట మునిగింది. దాంతో ఢిల్లీ విమానాశ్ర‌యానికి రావాల్సిన విమానాల‌ను దారి మ‌ళ్లిస్తున్నారు. ఇప్ప‌టికే నాలుగు దేశీయ‌, ఒక అంత‌ర్జాతీయ విమానాన్ని ఢిల్లీకి బ‌దులుగా జైపూర్‌, అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యాల‌కు మ‌ళ్లించారు.

* హైదరాబాద్‌ నుంచి లండన్‌కు ప్రయాణించేవారికి శుభవార్తను అందించింది ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా. భాగ్యనగరం నుంచి వారానికి రెండుసార్లు డైరెక్ట్‌ ఫ్లైట్‌ను నడుపుతున్నట్లు ప్రకటించింది. సోమ, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ విమాన సర్వీసును ఎయిర్‌ ఇండియా ఉన్నతాధికారులు వినాయకచవితి(శుక్రవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ మాట్లాడుతూ… హైదరాబాద్‌-లండన్‌కు ఎయిర్‌ఇండియా విమానాలను ప్రారంభించడం ద్వార విద్యార్థులకు, యూరప్‌ వెళ్లేవారికి, వ్యాపార, పారిశ్రామిక రంగాల వారికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

* కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుతున్న కొద్దీ పలు కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలుస్తున్నాయి. ఈ వరుసలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విప్రో (Wipro) కూడా తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ ను ముగించింది. సోమవారం నుంచి ఉద్యోగులు కార్యాలయంలో విధులకు హాజరుకానున్నారు. అది కూడా వారంలో రెండు రోజులు మాత్రమే కార్యాలయానికి వస్తారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్‌-19 సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. ఈ విషయాన్ని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ట్విట్టర్‌లో తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 18 నెలలుగా విప్రో సంస్థ తమ ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వర్తించేందుకు అనుమతించింది.విప్రో ఉద్యోగులు 18 నెలల విరామం తర్వాత సోమవారం నుంచి తిరిగి కార్యాలయాలకు రానున్నారు. పూర్తిగా టీకా డోసులు తీసుకున్న విప్రో ఉద్యోగులు వారంలో రెండు రోజులు మాత్రమే కార్యాలయాలకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ‘18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మా నాయకులు తిరిగి కార్యాలయానికి వస్తున్నారు (వారానికి రెండుసార్లు). ఉద్యోగులందరికీ పూర్తిగా టీకా డోసులు వేశాం. సురక్షితంగా, సామాజికంగా దూరం పాటిస్తూ అందరూ విధులకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేం దీనిని నిశితంగా పరిశీలిస్తాం’ అని విప్రో చైర్మన్ రిషద్‌ ప్రేమ్‌జీ ట్విట్టర్‌లో తెలిపారు. కొవిడ్-19 భద్రతా ప్రోటోకాల్‌ టెంపరేచర్‌ తనిఖీలు, క్యూఆర్ కోడ్ స్కాన్‌లు ఎలా చేపడుతున్నారనే వీడియోను ఆయన షేర్‌ చేశారు.దాదాపు 55 శాతం మంది భారతీయ ఉద్యోగులకు టీకాలు వేసుకున్నారని జూలై 14 న జరిగిన కంపెనీ 75 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిషద్‌ ప్రేమ్‌జీ వెల్లడించారు. భారతదేశంలో విప్రో సంస్థలో ప్రస్తుతం 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021 చివరి నాటికి లేదా 2022 ప్రారంభం కల్లా 70-80 శాతం మంది ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి తీసుకురానున్నట్లు ఐటీ సేవల దిగ్గజ సంస్థ టీసీఎస్ ఈ నెల ఆరంభంలో తెలిపింది. ప్రస్తుతం వారంలో కొన్ని రోజులు మాత్రమే కార్యాలయానికి అనుమతించేలా చాలా కార్పొరేట్‌ సంస్థలు హైబ్రిడ్ మోడల్‌ వర్క్‌ను అవలంభిస్తున్నాయి.

* ఈనెల 23 నుంచి తైగూన్‌ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఫోక్స్‌ వ్యాగన్‌ ప్రకటించింది. ఈ తైగూన్‌కు ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ఆరంభించింది కూడా. 1.5 లీటర్ల ఇంజిన్‌ కలిగిన మోడల్‌లో 7-స్పీడ్‌ డీఎస్‌జీ, 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 1 లీటర్ల టీఎస్‌ఐ ఇంజిన్‌ కలిగిన మోడల్‌లో 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌, మాన్యువల్‌లో లభించనున్నది.