WorldWonders

₹5 ఇవ్వకుండా తన్నులు తిన్నాడు-నేరవార్తలు

₹5 ఇవ్వకుండా తన్నులు తిన్నాడు-నేరవార్తలు

* కె.పి.హెచ్.బి కాలనీలోని గ్రాండ్ సితార గ్రాండ్ హోటల్ లో చంద్రశేఖర్ అనే వైద్యుడి ఆత్మహత్య…మెదక్ లో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న చంద్ర శేఖర్…నిజాంపేటలో కుమారుడిని నీట్ పరీక్ష వ్రాయించేందుకు భార్యతో సహా వచ్చిన చంద్రశేఖర్..భార్యను ఇంటికి పంపించి, హోటల్ సితార గ్రాండ్ హోటలులో రూమ్ నం.314 తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

* వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. వారిద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఏడాది వరకూ వారి కాపురం బాగానే సాగింది. ఆ తదుపరి అదనపు కట్నం కోసం భర్త అత్తింటి వారి వేధింపులు అధికమయ్యాయి. వేధింపులను తట్టుకోలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. మియాపూర్ సీఐ వెంక‌టేశ్ వివ‌రాల ప్ర‌కారం….ఆదిలాబాద్‌కు చెందిన శ్రవణ్‌, తెల్లాపూర్‌కు చెందిన పావని(22)లు ఏడాది క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కాగా శ్రవణ్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తూ ఎస్ఎంఆర్‌ మెట్రో పోలీస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా అదనపు కట్నం తీసుకురావాలని భార్య పావనిని ఆమె భర్త శ్రవణ్‌ , అత్తమామలు శకుంతల హిమవంత్‌రెడ్డి ఆడపడుచులు వేధింపులకు గురి చేస్తున్నారు.

* కారులో మహిళపై కొందరు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కారు నుంచి బయటకు తోసేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. లక్నోకు చెందిన ఒక మహిళ కాన్పూర్‌లోని ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నది. నవాబ్‌గంజ్‌లోని అద్దె ఇంట్లో ఆమె నివసిస్తున్నది. కొన్ని నెలల కిందట ఫ్రెండ్‌ ద్వారా ఒక యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. దీంతో వారిద్దరు తరుచుగా కలుసుకునేవారు. అయితే ఆ వ్యక్తికి మరొకరితో సంబంధం ఉన్నదని ఆమె తెలుసుకుంది. దీంతో అతడితో మాట్లాడం మానేసింది.

* భోజనం చేసిన కస్టమర్‌, బిల్లులో రూ.5 తక్కువగా చెల్లించడంపై హోటల్‌ యజమాని మండిపడ్డాడు. తన కుమారుడితో కలిసి అతడ్ని చావకొట్టాడు. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జితేంద్ర దేహురి అనే వ్యక్తి ఘసీపూర్‌లోని ‘అమ్మ హోటల్‌’కు వెళ్లి భోజనం చేశాడు. రూ.45 బిల్లు ఇవ్వాలని హోటల్‌ యజమాని చెప్పాడు. అయితే తన వద్ద రూ.40 మాత్రమే ఉన్నదని, మిగతా ఐదు రూపాయలు మరోసారి వచ్చినప్పుడు ఇస్తానని జితేంద్ర తెలిపాడు. దీనికి హాటల్‌ యజమాని మధు సాహు ఒప్పుకోలేదు. కాగా, కూరగాయలతో కూడిన ప్లేట్‌ మీల్స్‌కు రూ.45 తీసుకుంటారా అని కస్టమర్‌ జితేంద్ర వాదనకు దిగాడు. దీంతో హాటల్‌ యజమాని సాహు తన కుమారుడితో కలిసి అందరూ చూస్తుండగా అతడిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.