Movies

నాకు శంకర్ స్నేహం వద్దు. నాకు శుభం కార్డే లేదు.

నాకు శంకర్ స్నేహం వద్దు. నాకు శుభం కార్డే లేదు.

వెండితెరపై తన హాస్య కెరీర్‌ మళ్లీ మొదలైందని ప్రముఖ హాస్యనటుడు వడివేలు పేర్కొన్నారు. చాలా గ్యాప్‌ తర్వాత సురాజ్‌ దర్శకత్వంలోని ‘నాయ్‌ శేఖర్‌’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. చెన్నైలో విలేకర్ల సమావేశంలో వడివేలు మాట్లాడుతూ.. ‘‘అందరూ నా పనైపోయిందని, తెరపై కనిపించడని అనుకుంటున్నారు. వారందరికీ నా సినిమాలోని ఓ హాస్య డైలాగు ‘నాకు ఎండ్‌ కార్డే లేదురా’ అన్నదే సమాధానం. ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసొచ్చిన తర్వాత జీవితంలో చాలా మార్పులొచ్చాయి. సమస్యలన్నీ తొలగిపోయి సినిమాల్లో నటిస్తున్నానని’’ పేర్కొన్నారు. ‘మీరు షూటింగ్‌కు సరిగ్గా రావడం లేదని, మీ వల్ల కోట్లాది రూపాయలు నష్టమైందని ఆరోపిస్తున్నారే’ అని పాత్రికేయులు ప్రశ్నించగా.. ‘‘అదంతా అబద్ధమే. రూ.100 కోట్ల నష్టమని చెబుతారు. వాటన్నింటినీ నమ్మలేం. మళ్లీ శంకర్‌ నిర్మాణంలో నట్టించే ఉద్దేశం లేదు. ఆయన స్నేహమే వద్దు’’’ అని వడివేలు చెప్పారు.