Business

ప్రభుత్వోద్యోగులకు Bank Of India కోటి రూపాయిల ప్రయోజనం-వాణిజ్యం

* ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, జొమాటో కీలక వ్యవహారాలన్నీ చూసుకునే గౌరవ్‌ గుప్తా(38).. కంపెనీని వీడినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా హౌజ్‌లలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ పరిణామంతో జొమాటో షేర్లు స్వల్ఫంగా పతనం అయ్యాయి.

* ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) అదిరిపోయే శుభవార్త తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కోసం “శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్” పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఉద్యోగులు ఉచితంగా కోటి రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) తన వెబ్ సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. బీఓఐ శాలరీ ప్లస్ అకౌంట్ స్కీం కింద మూడు రకాల వేతన ఖాతాలు ఉన్నాయి. ఉద్యోగులు కేవలం కేవలం శాలరీ అకౌంట్ కింద మాత్రమే ఖాతా తెరిచే అవకాశం ఉంది. బీఓఐ శాలరీ ప్లస్ అకౌంట్ స్కీం కస్టమర్లకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద, బ్యాంకు వేతన ఖాతాదారులకు రూ.30 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. బ్యాంకు షేర్ చేసిన ట్వీట్ ప్రకారం వేతన ఖాతాదారుడికి రూ.కోటి ఉచిత ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా అందిస్తుంది.

* స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు లాభాలతో ముగిసింది. దేశీ సూచీలు సరికొత్త ఎత్తులు తాకాయి. ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58,482 పాయింట్లతో మొదలైంది.ఆ తర్వాత కొద్ది మొత్తంలో పాయింట్లు కోల్పోయినా నష్టాల్లోకి జారుకోలేదు. సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్‌ ముగిసే సమయానికి 69 పాయింట్ల లాభంతో 58,247 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,420 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 17,438 పాయింట్లను అత్యధిక స్థాయి టచ్‌ చేసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 17,382 దగ్గర క్లోజయ్యింది.

* పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో భారతీయ మంత్రిత్వ శాఖ ప్యానెల్ దేశీయంగా ఒకే రేటు కింద పన్ను విధించడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగబోయే 45వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తుల(పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఏవియేషన్ టర్బైన్)ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం, కోవిడ్-చికిత్స ఔషధాలపై పన్ను రాయితీలను డిసెంబర్ 31 వరకు పొడగించడం, 8 మిలియన్ రిజిస్టర్డ్ సంస్థలకు ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేసే విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.