ScienceAndTech

ఫైబర్‌నెట్ కేసులో మొదటి వ్యక్తి అరెస్ట్-నేరవార్తలు

ఫైబర్‌నెట్ కేసులో మొదటి వ్యక్తి అరెస్ట్-నేరవార్తలు

* ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్.గత ప్రభుత్వ హయాం లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ MD గా పని చేసిన సాంబశివరావు.కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ పై వచ్చి AP లో పని చేసిన సాంబశివరావు.ఇప్పటికే సాంబశివరావు తో పాటు హరి ప్రసాద్ ను విచారించిన CID.సాంబశివరావు కు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.మరి కొద్ది సేపట్లో గుంటూరు కోర్ట్ లో హాజరుపరచనున్న CID అధికారులు.

* పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పాల బూత్‌ యజమాని సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న అర్ధరాత్రి సురేశ్‌ తన పాల బూత్‌లో పని చేస్తున్న యువతిని బైక్‌పై ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టాడు. తాను ప్రేమిస్తున్న యువతిని సురేశ్‌ బైకుపై ఎక్కించుకున్నాడనే కోపంతో ఓ యువకుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సురేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్‌ మృతిచెందారు. ఘటన అనంతరం దాడి చేసిన యువకుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 103వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు ఇవాళ కడప జమాలపల్లి వాసి విజయశంకర్‌రెడ్డి హాజరయ్యారు. ఇతను తొలిసారి సీబీఐ విచారణకు వచ్చాడు. ఇతడితో పాటు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు వాడిన ఆయుధాల గురించి ఇతడిని విచారిస్తున్నట్లు సమాచారం.

* నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. చేజర్ల మండలం ఉలవపల్లిలో కొందరు ఇసుక అక్రమ రవాణాకు యత్నించగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ దశలో రెచ్చిపోయిన ఇసుకాసురులు బొలిగర్ల జయరామయ్య అనే వ్యక్తిపై రాడ్లపై దాడి చేశారు. జయరామయ్య తలకు తీవ్రగాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా గురించి పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

* నగర శివారు ప్రాంతమైన పెద్దఅంబర్‌పేట్‌లో క్రిమి సంహారక రసాయనాల గోదాంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రశాంత్‌ గోదాంను నాలుగు నెలల క్రితమే స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ అద్దెకు తీసుకుంది. అందులో క్రిమిసంహారక మందుల్ని నిల్వ చేశారు. శుక్రవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో గోదాంలో అగ్గిరాజుకుని మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున పురుగుల మందు నిల్వలు ప్లాస్టిక్‌ డబ్బాలు, సంచులు, అట్టపెట్టల్లో ఉండడంతో ఓ పక్క మంటలు ఆర్పుతుండగా మరోపక్క అగ్గి రాజుకుని దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. దాంతో అగ్నిమాపక సిబ్బంది, రామోజీ ఫిలింసిటీకి చెందిన ఫైరింజన్‌ సిబ్బంది దాదాపు ఐదు గంటల పాటు నిర్విరామంగా శ్రమించి సాయంత్రానికి కల్లా అదుపులోకి తెచ్చారు. ఒకదశలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు జేసీబీల సాయంతో గోదాం గోడలను కూలగొట్టారు. దట్టమైన పొగలు, భరించలేని విష వాయువులతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సమీప కాలనీవాసులను కొన్ని గంటల పాటు ఇళ్లలో ఉండరాదంటూ అధికారులు హెచ్చరించారు. మంటలు ఆర్పుతుండగా బయటకు వచ్చే నీరు విషతుల్యం కావడంతో అది డ్రైనేజీల్లో కలకుండా పెద్దఅంబర్‌పేట్‌ పురపాలిక కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ గుంతలు తీయించి ఆ నీటిని అందులోకి మళ్లించారు. రూ. 18 కోట్లమేర ఆస్తినష్టం సంభవించినట్లుగా అంచనా.