DailyDose

వినాయకుడి ఊరేగింపులో తెదేపా-వైకాపా శ్రేణుల ఘర్షణ: నేరవార్తలు

వినాయకుడి ఊరేగింపులో తెదేపా-వైకాపా శ్రేణుల ఘర్షణ: నేరవార్తలు

* పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వినాయకుడి ఊరేగింపు లో టి.డి.పి. వై.సి.పి కార్యకర్తల మధ్య వివాదం…వై.సి.పి వారు టి.డి.పి.మాజీ ఎంపీటీసీ ఇంటిపై దాడి….ఇంట్లొ చొర బడి షర్నిచర్ ని తగలబేట్టిన వైనం….ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్ళతో కర్రలతో దాడులు….ఇద్దరికి గాయాలు అంబులెన్స్ లో హాస్పటల్ కి తరలింపు…గ్రామంలో ప్రత్యేక బలగాల మోహరింపు….ఎప్పుడు ఏమిజరుగుతుందో అని భయాఒదోళనలో స్థానికులు….ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న దాఖ లాలులేవంటున్న స్థానికులు.

* కృష్ణాజిల్లా వీరులపాడు మండలం లో విజిలెన్స్ దాడులు…జయంతి గ్రామంలో కాజా శ్రీనివాస్ కిరాణా షాప్ లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు…తనిఖీలలో 500 క్వింటాలు అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు…అనంతరం సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు అందజేసిన విజిలెన్స్ అధికారులు.

* గుజరాత్ భారీ డ్రగ్స్‌ కేసుతో విజయవాడకు ఎలాంటి సంభందం లేదని తేల్చి చెప్పిన పోలీసులు..విజయవాడ పేరుతో ఎక్స్‌పోర్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ మాత్రమే నమోదు చేశారని, చెన్నైకి చెందిన సుధాకర్ దంపతుల పేరుతో కంపెనీ ఉందని స్పష్టం చేశారు..గుజరాత్ ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుకున్న డిఆర్ఐ అధికారులు పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు..ఢిల్లీకి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు సమాచారం సేకరించారు..డ్రగ్స్‌ మాఫియా వెనుక ఢిల్లీకి చెందిన కుల్‌దీప్‌సింగ్ అనే వ్యక్తి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం..జూన్‌లోనే ఆషీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్స్‌ రవాణా జరిగిందని, రాజస్థాన్‌ వాసి జయదీప్‌ లాజిస్టిక్ ద్వారా డ్రగ్స్‌ సరఫరా జరిగినట్టు గుర్తించారు డీఆర్‌ఐ అధికారులు..RJ 01 GB 8328 కంటైనర్‌ లారీలో డ్రగ్స్‌ తరలించినట్టు గుర్తించారు.తప్పుడు అడ్రస్‌లతో బియ్యం రవాణా ముసుగులో కుల్‌దీప్‌ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం సేకరించారు.ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని, టాల్కం ఫౌండర్‌ పేరుతో గుజరాత్ ముంద్రా పోర్టు ద్వారా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు..కుల్‌దీప్‌ను పట్టుకునేందుకు డీఆర్‌ఐ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది.

* పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.నిడమర్రు మండలం​ మందలపర్రులో వద్ద  రోడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.మృతిచెందిన వారిని సుమంత్‌(35), శరత్‌(28)లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.