DailyDose

ఆయేషా మీరా హత్యకేసులో కోనేరు సతీష్‌కు ఊరట-నేరవార్తలు

Auto Draft

* ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టేసింది. ఈ హత్యకేసులో అనుమానితులకు నార్కో పరీక్షలపై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 2007 డిసెంబరు 27న హత్యకు గురైన ఆయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్‌, మరో ఏడుగురిపై నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్‌తో పాటు.. హాస్టల్లో ఆయేషా మీరాతో ఉన్న స్నేహితురాళ్ల సమాచారం కీలకమని, వారికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు అవసరమని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది.

* కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరు పోలీసుల పీటీ వారెంట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 8న బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌లో పార్థసారథిపై కేసు నమోదైంది. రూ.109 కోట్ల మోసం కేసులో పార్థసారధితో పాటు కార్వీ సీఈవో రాజీవ్‌ రంజన్‌, సీఎఫ్‌వో కృష్ణపై కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై మూడు రోజుల కస్టడీకి బెంగళూరు పోలీసులు అనుమతి కోరగా.. నాంపల్లి కోర్టు అనుమతించింది. అనారోగ్యం కారణంగా బెంగళూరు పోలీసుల విచారణకు హాజరుకాలేనని పార్థసారథి పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పీటీ వారెంట్‌ రద్దు చేసింది. పార్థసారథి ప్రస్తుతం హైదరాబాద్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

* ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లోని డీఆర్‌డీఓ రహస్యాల లీకు ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టు చేసిన అయిదుగురు వ్యక్తులను ఒడిశా క్రైమ్‌బ్రాంచి అధికారులు రిమాండ్‌కు తీసుకొని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. మంగళవారం ఏడీజీ సంజీబ్‌ పండా మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితుల్లో ఒకరి బ్యాంకు ఖాతాకు దుబాయ్‌ నుంచి రెండు విడతల్లో రూ.38,000 వచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. నిందితులు ఓ మహిళతో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేశారు. ఆమె యూకేకు చెందిన సెల్‌ఫోన్‌ నంబరు ద్వారా ఫేస్‌బుక్, వాట్సాప్‌లో సంభాషించింది. ఆమె ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల (హ్యాండ్‌లర్ల)తో పరిచయం ఏర్పడింది. హ్యాండ్‌లర్లకు రహస్యాలు పంపినందుకు ఈ అయిదుగురు డీల్‌ కుదుర్చుకున్నారు. సదరు మహిళ వేర్వేరు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల వారితో ఛాటింగ్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నిందితుల సోల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, వివరాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాం. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో భారత వైమానిక దళానికి చెందిన అధికారులు కటక్‌ చేరుకొని రెండు రోజులపాటు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించారు’ అని తెలిపారు.

* పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులు.కాల్పులు జరుపుతూ తప్పించుకున్న మావోయిస్టులు మల్కన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో కాల్పులు వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం తులసిపాడు అటవీప్రాంతానికి చేరుకున్న డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు పరారైన మావోయిస్టుల కోసం కొనసాగుతున్న కూంబింగ్

* అనంతపురం జిల్లా పెనుకొండ జాతీయ రహదారి శ్రీకృష్ణదేవరాయల వై జంక్షన్ వద్ద అనుమానాస్పద స్థితిలో బీహార్ కు చెందిన కృష్ట మృతి

* గద్వాల పట్టణంలో సర్వే రిపోర్ట్ కోసం అని తెలుగు రమణ అనే రైతు నుండి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు కేటి దొడ్డి మండల సర్వేయర్ తిక్కన్న ను గద్వాల పట్టణంలోని ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తదనంతరం కేటి దొడ్డి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు.

* వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన జుట్టు జమలప్ప(45) అనేవ్యక్తి పొలానికి వెళ్లివస్తా అంటూ ఇంట్లో చెప్పి రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనచెంది తెలిసిన వారిదగ్గర ఆచూకీ కోసం ప్రయత్నించగా ఆచూకీ దొరక్కపోవడంతో యలల పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో యాలాల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో లో 2 రోజుల క్రితం సంగయ్య పల్లి తాండ శివారులోని కాగ్నా నదిలో జమలప్ప మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసును యాలాల ఎస్ఐ రూరల్ సిఐ జలంధర్ రెడ్డి లు రెండు రోజులు కేసును ఛేదించడం జరిగింది.