DailyDose

తిరుపతిలో భారీ చోరీ-నేరవార్తలు

తిరుపతిలో భారీ చోరీ-నేరవార్తలు

* కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామం నేషనల్ హైవే పై బైక్ లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ కింద పడి బైక్ ఇస్ట్ మృతి..ఇతను ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తున్న రాజమండ్రి చంద్రశేఖర్ అనే ప్రైవేట్ ఎలక్ట్రిషన్.

* బెంగళూరు చామరాజపేటలోని భవనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి.

* తిరుపతి….ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ నగర్ లో ఘటన.11 లక్షల నగదుతోపాటు 400 గ్రాములు బంగారం చోరీ.పదవి విరమణ పొందిన ప్రొఫెసర్ గోపాల్ ,భార్య పద్మావతి నివాసం ఉండగా వీరిపిల్లలు విదేశాలలో ఉద్యోగం.గోపాల్ అనారోగ్యానికి గురై తిరుపతి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యచికిత్సా.బాధితురాలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ పద్మావతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

* మహారాష్ట్రలో మరో ఘోరం వెలుగుచూసింది. ఇటీవల ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. ఠాణే జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 29 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడుతున్న పాశవిక ఘటన కలవరపెడుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. నిందితుల్లో ఇద్దరు మైనర్‌ బాలురు ఉండటం గమనార్హం. వారంతా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి, బెదిరించి ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.

* సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ కూడలి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్‌ ఫెయిలై కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోయిన్‌పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

* సోషల్‌ మీడియా వలలో పడి మరో యువతి మోసపోయింది. ఫేస్‌బుక్‌లో పరిచయమై పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బు కాజేసి మోసం చేశాడని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ లాడ్జీలో బెంగళూరుకు చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల యువతి షబియా.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు మదనపల్లెకు చెందిన అబీద్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు.. ఆమె వద్ద నుంచి రూ.3 లక్షల వరకు నగదు తీసుకున్నాడు.