Business

ఇండియాలోకి వోక్స్‌వ్యాగన్ నూతన కారు-వాణిజ్యం

ఇండియాలోకి వోక్స్‌వ్యాగన్ నూతన కారు-వాణిజ్యం

* భారత మార్కెట్లోకి ఫోక్స్‌వేగన్‌ టైగన్‌ అడుగుపెట్టింది. వేరియంట్‌ను బట్టి ఈ ఎస్‌యూవీ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.10.49 లక్షల నుంచి 17.49 లక్షల వరకు ఉంది. దీనిలో ఫీచర్ల ఆధారంగా టైగన్‌ 1.0 కంఫర్ట్‌ లైన్‌, హైలైన్‌, హైలైన్‌ ఏటీ, టాప్‌లైన్‌ ఎంటీ, టాప్‌లైన్‌ ఏటీ, 1.5 టీఎస్‌ఐ జీటీ లైన్‌, 1.5 టీఎస్‌ఐ జీటీ లైన్‌ ప్లస్‌ వేరియంట్లను సిద్ధం చేశారు. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కారును లుక్స్‌లో చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలు మొత్తం అందుబాటులోకి తెచ్చారు. దీనిని స్కోడా కుషాక్‌ను తయారు చేసిన MQB-A0-IN ప్లాట్‌ ఫామ్‌పైనే దీనిని కూడా డిజైన్‌ చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా భారత రహదారి ప్రమాణాలకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. టైగన్‌ను ఇప్పటికే దేశవ్యాప్తంగా 12,221 మంది బుకింగ్‌ చేసుకొన్నారు.

* గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి క్రెడిట్ కార్డుల డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది. చాలా మంది ఈ కార్డుల‌ను వాడేందుకు మ‌గ్గుచూపుతున్నారు. అందువ‌ల్ల చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డుల‌ను ఇష్యూ చేయ‌డంతో పాటు అనేక ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఫెడ‌ర‌ల్ బ్యాంక్ కూడా ఒక కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఇది మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డ్‌. ఫిన్‌టెక్ సంస్థ‌ వన్‌కార్డ్‌ భాగస్వామ్యంతో ఈ కార్డును ప్రారంభిస్తున్న‌ట్లు సంస్థ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. రాబోయే పండుగ సీజ‌న్ వినియోగ‌దారుల‌కు మరింత ద‌గ్గ‌ర అయ్యేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బ్యాంక్‌ వెల్ల‌డించింది. ఈ క్రెడిట్ కార్డుల‌ను ఒన్‌కార్డ్ యాప్ ద్వారా జారీచేయ‌నున్నారు. అంతేకాకుండా కేవ‌లం కార్డు జారిచేసిన‌ మూడు నిమిషాల‌లోపే వెర్చువ‌ల్ ఫార్మెట్‌లో కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు. ఫిజిక‌ల్ కార్డు కోసం వేచి చూడ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఫిజ‌క‌ల్ కార్డు త‌రువాత ఇంటికి వ‌స్తుంది. యాప్ ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులను నియంత్రించవచ్చు – ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి రివార్డు పాయింట్లు, కార్డు లావాదేవీల ప‌రిమితిని సెట్ చేయ‌టం వ‌ర‌కు అన్ని యాప్ ద్వారా చేయ‌వ‌చ్చు. 23 నుంచి 35 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న యంగ్‌ వ‌ర్కింగ్ ప్రొఫిష‌న‌ల్స్ ల‌క్ష్యంగా ఈ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది.

* దేశీయ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అన్‌అకాడమీ 2021 సంవత్సరానికి లింక్డ్‌ఇన్‌ రూపొందించిన భారత అగ్రశ్రేణి అంకురాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బి2బి ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఉడాన్, ఫిన్‌టెక్‌ సంస్థ క్రెడ్‌లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఈ మూడూ యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల విలువైనవి)లే. 2020 జులై నుంచి 2021 జూన్‌ మధ్యకాలంలో ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీతో ఉద్యోగుల సంబంధాలు, ప్రతిభను వెలికితీయడం అనే 4 ప్రధాన అంశాల ఆధారంగా లింక్డ్‌ఇన్‌ ఈ అంకురాల జాబితా రూపొందించింది. ఇందులో అర్హత సాధించాలంటే కంపెనీకి 7 ఏళ్ల అనుభవం, కనీసం 50 మంది ఉద్యోగులు, దేశీయంగా ప్రధాన కార్యాలయం ఉండాలన్న నిబంధనలు పాటించింది. అన్‌అకాడమీ 344 కోట్ల డాలర్ల విలువతో తొలి ర్యాంకును సాధించింది. ఉడాన్‌ (2), క్రెడ్‌ (3), అప్‌గ్రేడ్‌ (4), రేజర్‌పే (5), మీషో (6), స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (7), బోట్‌ (8), అర్బన్‌ కంపెనీ (9), అగ్నికుల్‌ కాస్మోస్‌ (10) తరవాత స్థానాల్లో నిలిచాయి.