WorldWonders

సినీఫక్కీలో…ఢిల్లీ కోర్టులో దారుణ హత్య-నేరవార్తలు

సినీఫక్కీలో…ఢిల్లీ కోర్టులో దారుణ హత్య-నేరవార్తలు

* గుంటూరు సౌత్…ఇన్నర్ రింగ్ రోడ్డు లో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు

* మైనర్ బాలికతో ఆమె సమ్మతితో పురుషుడు లైంగిక సంబంధం పెట్టుకుంటే అది పోక్సో చట్టం కింద నేరం కాదని కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. 16 ఏళ్ల అమ్మాయికి అబ్బాయితో లైంగిక సంబంధం ఉందని తెలియదని అనుకోవడం సరికాదని తెలిపింది. ఏం చేస్తున్నామో, దాని పర్యవసానాలు ఏంటో ఆమెకు తెలుసునని కోర్టు గమనించింది.

* క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. గత నెలలో జ్యోతిష్యుడు లక్ష్మీ కాంత శర్మను బ్లాక్ మెయిల్ చేశారనే కేసులో పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల పాటు చంచల్ గూడ జైలులో రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిమాండ్ పూర్తయినందున బెయిల్ పై గురువారం బయటకొచ్చి ఇంటికి చేరుకున్నారు. కాగా, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తనని డబ్బులివ్వాలని బెదిరించారని నిజామాబాద్ జిల్లా, ఎడపల్లికి చెందిన కల్లు వ్యాపారి జయవర్ధన్‌ గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

* ఢిల్లీలోని రోహిణీ కోర్టు కాల్పులతో దద్దరిల్లింది. ఓ కేసులో అరెస్టయిన గ్యాంగ్ స్టర్ జితేంద్ర అలియాస్ గోగిని జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు తీసుకురాగా.. ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. లాయర్ల ముసుగులోకి కోర్టులోకి ఎంటరైన దుండగులు.. ఓ మహిళా లాయర్ సహా జితేంద్రపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జితేంద్ర స్పాట్ లోనే చనిపోయాడు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో లాయర్ల వేషంలో వచ్చిన ఇద్దరు దుండగులు చనిపోయారు. మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.