Movies

ప్రేమ్‌నగర్‌కు 50ఏళ్లు

ప్రేమ్‌నగర్‌కు 50ఏళ్లు

ప్రేమనగర్, 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా పునర్నిర్మించారు.

ప్రేమనగర్
(24.09.1971 తెలుగు సినిమా)

దర్శకత్వం
కె.ఎస్.ప్రకాశరావు

నిర్మాణం
డి. రామానాయుడు

తారాగణం
అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కైకాల సత్యనారాయణ,
రాజబాబు

సంగీతం
కె.వి.మహదేవన్

నిర్మాణ సంస్థ
సురేష్ మూవీస్

పంపిణీ
సురేష్ ప్రొడక్షన్స్

విడుదల తేదీ
సెప్టెంబరు 24, 1971

పాత్రలు-పాత్రధారులు

కల్యాణ్ వర్మగా అక్కినేని నాగేశ్వరరావు
లతగా వాణిశ్రీ
కల్యాణ్ తండ్రి జమిందార్ – ఎస్.వి. రంగారావు
లత తండ్రిగా గుమ్మడి వెంకటేశ్వరరావు
కేశవ్ వర్మగా కైకాల సత్యనారాయణ
దాసుగా రాజబాబు
డాక్టర్ గా చిత్తూరు నాగయ్య
దివాన్ గా ధూళిపాల సీతారామశాస్త్రి
రమణా రెడ్డి
వంటవాడుగా కె.వి.చలం
స్కూల్ టీచర్ గా రావి కొండలరావు
దేవాలయ పురోహితుడుగా సాక్షి రంగారావు
లత అన్నయ్యగా కాకరాల
కల్యాణ్ తల్లిగా శాంతకుమారి
లత తల్లిగా తెన్నేటి హేమలత
సూర్యకాంతం
ఇంద్రాణి, కేశవ్ వర్మ భార్యగా ఎస్. వరలక్ష్మి
హంస, పనిమనిషిగా రమాప్రభ
ఐటెం గర్ల్ గా జ్యోతిలక్ష్మి
ఆయాగా పుష్పలత
గౌరిగా పుష్పకుమారి
కమలగా మీనాకుమారి
చిన్ననాటి కేశవ్ వర్మగా దగ్గుబాటి వెంకటేష్