ScienceAndTech

తిరుపతిపై ఆన్‌లైన్ గేమ్ రూపొందించిన వ్యక్తి అరెస్ట్

తిరుపతిపై ఆన్‌లైన్ గేమ్ రూపొందించిన వ్యక్తి అరెస్ట్

తిరుపతికి చెందిన వరదాచారి సురేష్ అనే వ్యక్తి ‘తిరుపతి హిల్ క్లైబింగ్ రేసింగ్ గేమ్ అండ్ తిరుపతి బస్ డ్రైవర్” అనే పేరుతో ఆన్లైన్ లో గేమ్ తయారు చేయడంతో పాటు, “డిజిటల్ అన్నమయ్య” పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చిందని సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. విజిలెన్స్ అధికారులు విచారణ జరపగా, నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ పేరుతో వరదాచారి సురేష్ అనే వ్యక్తి ఆన్లైన్ గేమ్ తయారు చేసి గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచారన్నారు. అలాగే వెబ్సైటు కూడా నిర్వహిస్తున్నట్లు నిరూపణ అయిందన్నారు. టీటీడీ పేరు ఉపయోగించుకుని ఇలాంటి ఆన్లైన్ గేమ్ లు, వెబ్సైట్లు నిర్వహిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సివిఎస్ఓ హెచ్చరించారు. ఇలాంటి ఆన్లైన్ గేమ్ లు, వెబ్సైట్లతో టీటీడీ కి ఎలాంటి సంబంధం లేదనే విషయం ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.