Editorials

ఏపీ తెలంగాణలో బంద్ పైTNI ప్రత్యేక కథనాలు

ఏపీ తెలంగాణలో బంద్ పైTNI ప్రత్యేక కథనాలు

* దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం భారత్ బంద్ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు సామాన్య ప్రజలకు భారంగా మారాయన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చిందన్నారు. దానికి నిరసనగా గాంధీ భవన్ నుండి గుర్రపు బండి మీద అసెంబ్లీకి వెళ్తున్నామన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిర్ణయం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

* రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ బంద్‌కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం బంద్ ఉద్దేశం కాదన్నారు. 51 కంపెనీలకు కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, అయినా రెండు కంపెనీలకే ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. ఆరు లక్షల కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. బస్సులను, రైళ్లను కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే నల్ల చట్టాలు తెచ్చారని… వీటికి వ్యతిరేకంగానే ఈ రోజు బంద్ చేపడుతున్నట్లు చెప్పారు. ఇది ప్రజల బంద్…పార్టీల బంద్ కాదని తమ్మినేని స్పష్టం చేశారు.

* రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న భారత్ బంద్ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో అనంతపురం నగరంతో పాటు అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లో పోలీసులు బందోబస్తు చేపట్టారు.ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు… జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులు, తదితర చోట్ల ఎలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

* భారత్‌ బంద్‌.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులుదేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతోంది.ఈ బంద్‌లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ, తెదేపాతో పాటు పలు రైతు సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి.బంద్‌ నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.ఇండియా గేట్‌, విజయ్‌ చౌక్‌ సహా ముఖ్యమైన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు.నిరసన శిబిరాల నుంచి రైతులు దిల్లీలోకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.ఏపీ ప్రభుత్వం భారత్‌ బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.

* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో భారత్ బంద్ ఆందోళన మొదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ బస్ డిపోను ముట్టడించారు. బస్సులు బయటకు వెళ్లకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

* భారత్ బంద్ మరియు గులాబ్ తుఫాన్ కారణంగా నేడు జరగాల్సిన స్పందన కార్యక్రమం పలు జిల్లాలో వాయిదా పడింది.