Business

పెరిగిన చమురు ధరలు. హైదరాబాద్‌దే ఆ రికార్డు-వాణిజ్యం

పెరిగిన చమురు ధరలు. హైదరాబాద్‌దే ఆ రికార్డు-వాణిజ్యం

* మరోసారి పెరిగిన చమురు ధరలుదేశంలో ఇంధన​ ధరలు మరోసారి పెరిగాయి.లీటర్ డీజిల్​పై 24 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.దేశంలో డీజిల్​ ధరల పెంపు కొనసాగుతోంది. సోమవారం.. దిల్లీలో లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరిగింది.ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.దీంతో దిల్లీలో లీటర్​ డీజిల్​ ధర రూ. 89.33కు చేరుకుంది.ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ. 96.9కు చేరగా.. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107.27 వద్ద కొనసాగుతోంది.కోల్​కతాలో లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరగడం వల్ల ధర రూ. 92.38కు చేరింది. లీటర్​ పెట్రోల్​ రూ.101.64గా ఉంది.చెన్నైలో లీటర్​ డీజిల్​ 23 పైసలు పెరిగి రూ. 93.90 వద్ద కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​ 98.97గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో…హైదరాబాద్​లో లీటర్ డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.97.43 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్ ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది.వైజాగ్​లో లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ.97.90 వద్దకు చేరింది. పెట్రోల్ ధర రూ.106.23గా ఉంది.గుంటూరులో డీజిల్​ లీటర్​పై 25 పైసలు పెరిగి.. రూ.99.13 వద్దకు చేరింది. పెట్రోల్ ధర లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది.

* దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లోనే పెరిగాయని జేఎల్‌ఎల్‌ ఇండియా పేర్కొంది. 2013 నుంచి 2021 మధ్యకాలంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, పుణె, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో ప్రజల్లో ఇల్లు కొనుగోలు చేసే శక్తి పెరిగినట్లు ‘హోమ్‌ పర్చేజ్‌ అఫోర్డబులిటీ ఇండెక్స్‌- 2021’ నివేదికలో వివరించింది. గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గడం, ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉండటం కలిసొస్తోందని వెల్లడించింది. ఈ ఏడాదిలో కుటుంబ ఆదాయాలు గత ఏడాదితో పోల్చితే 7-9% మేరకు పెరిగాయని, గృహ రుణాలపై వడ్డీరేట్లు 15 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదార్లకు అత్యంత అనుకూలమైన నగరంగా కోల్‌కతా ఉందని, తదుపరి స్థానాల్లో హైదరాబాద్‌, పుణె ఉన్నాయని వివరించింది. ‘1,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసేందుకు అవసరమైన సగటు ఆదాయం హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లోని ప్రజలకు అధికంగా ఉంది’ అని పేర్కొంది.

* 30కి చేరే సరికే మనం కొంత పొదుపు చేసి ఉండాలి. చిన్న చిన్న పెట్టుబడులు ప్రారంభించాలి. ఒకవేళ ఇవేవీ చేయకపోతే 30లలో ఈ రెండు అంశాలపై దృష్టి సారించాలి. మీ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటికి అనుగుణంగా పొదుపు, మదుపును ఎంచుకోండి. ప్రతి మదుపునకు ఓ లక్ష్యం ఉండాలి. ఇళ్లు, కారు కొనడం, పిల్లల చదువులు.. ఇలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అవి ఎప్పటికి సాధించాలో నిర్ణయించాలి. అందుకు అనుగుణంగా మీ ప్రణాళిక ఉండాలి.

* సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్‌ అవుతుంటారు. అయితే, 30లలోకి ప్రవేశించిన వారు ఇప్పటి నుంచి రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం గురించి ఎందుకని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంకా మూడు దశాబ్దాల సమయం ఉంది కదా అని మదుపును వాయిదా వేస్తూ వస్తుంటారు. కానీ, ఇది పెద్ద తప్పు. బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇన్వెస్ట్‌ చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి తక్కువ బాధ్యతలు ఉన్నప్పుడే ఎంతో కొంత రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం కోసం పక్కన పెట్టడం ప్రారంభించాలి. మంచి రిటర్న్స్‌ ఇచ్చే పథకాల్లో మదుపు చేయాలి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఇంట్రాడేలో భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 1000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ సైతం 1.66 శాతం కుంగింది. అయితే, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. కానీ, పూర్తి స్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా స్థిరాస్తి, ఐటీ, మీడియా, సేవా, ఆర్థిక సేవలు, ఆటో రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంధన, పీఎస్‌యూ బ్యాంకింగ్‌, కమొడిటీస్‌, లోహ, ఫార్మా రంగ షేర్లు సూచీల పతనాన్ని ఒకింత కట్టడి చేయగలిగాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. ఎవర్‌గ్రాండ్‌, చైనాలో విద్యుత్తు కొరత సూచీలను కలవరపెట్టాయి. మరోవైపు బ్రిటన్‌లో ఇంధన కొరత, చైనాలో పరిస్థితుల దృష్ట్యా ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో కదలాడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ పరిణామాలు నేటి ట్రేడింగ్‌లో దేశీయ సూచీల సెంటిమెంటను మరింత దెబ్బతీశాయి.

* అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.39, డీజిల్‌ రూ.89.57కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.107.47, రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్‌ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్‌ ధరలు నాలుగోసారి పెరిగింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 114 పాయింట్లు నష్టపోయి 59,963 వద్ద.. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 17,835 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.71 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

* భారత్‌కు చెందిన మొబైల్‌ కంటెంట్‌ ప్రొవైడరు గ్లాన్స్‌ ఇన్‌మొబిలో వాటా కొనుగోలు కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) సంప్రదింపులు జరుపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గూగుల్‌ మద్దతు ఉన్న ఈ యూనికార్న్‌ సంస్థలో ఆర్‌ఐఎల్‌ 300 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2250 కోట్ల) వరకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తోందని ఒక ఆంగ్ల పత్రిక తెలిపింది. కొద్దివారాల్లో ఈ లావాదేవీ పూర్తి కావొచ్చని సమాచారం.