DailyDose

వేగంగా వివేకా హత్యకేసు దర్యాప్తు-నేరవార్తలు

వేగంగా వివేకా హత్యకేసు దర్యాప్తు-నేరవార్తలు

* పోసాని వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక ఫైర్…తక్షణం పోసానిని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని, ప్రభుత్వం స్పందించి అతడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరిన నిహారిక.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 114వ రోజు కొనసాగుతోంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా ఇవాళ వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అతడిని కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని విచారించిన అధికారులు మరోసారి విచారణకు పిలిచారు. నిన్న వేముల జడ్పీటీసీ సభ్యుడు వెంకట బయపురెడ్డిని సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డికి వెంకట బయపురెడ్డి అనుచరుడని సమాచారం.

* నగరంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. సాంకేతికత ఉపయోగించుకొని బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడారు. ‘‘పక్కా సమాచారంతో మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లితో పాటు ఏడు చోట్ల దాడులు నిర్వహించాం. 23 మంది బుకీలను అరెస్టు చేయడంతో పాటు రూ.93 లక్షలు సీజ్‌ చేశాం. మొత్తం రూ.2.2 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. గూగుల్‌లో ఉన్న మొబైల్ యాప్‌తో ఈ ముఠా బెట్టింట్‌కు పాల్పడుతోంది.

* ఇంఫాల్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) రూ.42 లక్షల బంగారం స్వాధీనం చేసుకొంది. జిగురు ముద్దగా నాలుగు ప్యాకెట్లలో ఉన్న ఈ బంగారు 909.7 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల సందర్భంగా నిందితుడి వైఖరి అనుమానాస్పదంగా ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.దిల్లి పసిగట్టారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మహమ్మద్‌ షరీఫ్‌ అనే ఈ ప్రయాణికుడు ఇంఫాల్‌ నుంచి దిల్లీకి వెళుతూ పట్టుబడ్డాడు. వైద్యపరీక్షలకు తరలించి, దేహం కిందిభాగం మొత్తం ఎక్స్‌రే తీయగా మల రంధ్రంలో బంగారం దాచిన విషయం బయటపడింది.

* ఆ బాలికకు ఏం కష్టమొచ్చిందో తెలియదుకానీ.. అద్దం ముక్కతో కంఠం కోసుకుని ప్రాణాలు తీసేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో బాలిక కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఇంటి పెద్ద కొవిడ్‌తో చనిపోవడంతో కొడుకు, కూతురుతో అతని భార్య అంబాజీపేట మండలంలోని పుట్టింటికి వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పోలీసుస్టేషన్లో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ గొడవలన్నింటికీ కారణం తనేనని అందరూ నిందిస్తున్నారంటూ మనస్తాపం చెందిన బాలిక(13) సోమవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లి అద్దం ముక్కతో గొంతు కోసుకుని, అరుస్తూ బయటికొచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు అమలాపురంలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చనిపోవడానికి ముందు రోజు గొంతువద్ద చాకు, అద్దం, బ్లేడు దేనితో కోసుకుంటే ఎంత సేపటికి చనిపోతామని తనను అడగడంతోపాటు సామాజిక మాధ్యమంలో చూస్తుండటంతో మందలించానని, ఇంతలోకే ఇలా చేసుకుందంటూ ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఘటనాస్థలాన్ని సీఐ సురేష్‌బాబు పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్యకుమార్‌ చెప్పారు.