DailyDose

పోసాని ఇంటిపై రాళ్లదాడి. గన్నవరంలో భారీ చోరీ-నేరవార్తలు

పోసాని ఇంటిపై రాళ్లదాడి. గన్నవరంలో భారీ చోరీ-నేరవార్తలు

* పోసాని ఇంటిపై ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్లదాడి ◆ అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై పై రాత్రి 2 గంటల ప్రాంతంలో రాళ్లువిసిరిన దుండగులు.◆ పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయిన దుండగులు.◆ భయాందోళనలకు గురైన వాచ్ మెన్ కుటుంబ సభ్యులు.◆ ఎనిమిది నెలలుగా వేరే చోట ఉంటున్న పోసాని కుటుంబం.సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వాచ్ మెన్..◆ సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సమీపంలోని సిసి ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ◆ గత మూడు రోజులుగా పవన్, కళ్యాణ్ పోసానిల మధ్య మాటల యుద్ధం. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి ..◆ పోసాని ఇంట్లోనే ఉన్నాడు అనుకున్న దుండగులు.బూతులు తిడుతూ రాళ్లు..ఇసుకలు విసిరారు అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

* గన్నవరం ఆంధ్ర బ్యాంకు లో భారీ చోరీ…..సీసీ పుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన మహిళా ఇద్దరు పిల్లల వివరాలను సేకరిస్తున్న స్థానిక పోలీసులు….ఇద్దరు పిల్లలతో బ్యాంకుకు వచ్చిన మహిళ……బ్యాంకుకు వచ్చిన వేరే మహిళ బ్యాగ్లో 65 వేల రూపాయలు డబ్బును కాజేసిన మహిళా ఇద్దరు పిల్లలు…..బ్యాంకు నుంచి పిల్లలతో పరారైన మహిళ…..గన్నవరం పోలీస్ స్టేషన్ లో మహిళ పై కేసు నమోదు చేసిన ఎస్ఐ పురుషోత్తం……మహిళా ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టిన గన్నవరం పోలీసులు.

* పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) మూడు నెలలుగా కిరణ్‌ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తోంది. ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు. బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు తెలియకుండా కిరణ్‌ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకనే తన సోదరి తనువు చాలించిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడైన కిరణ్‌ కోసం గాలిస్తున్నారు.

* కాకినాడలో కొందరు విలేకరుల బ్లాక్మెయిలింగ్ ఎక్కువయిం దని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆరోపించారు . తన నియోజకవర్గంలో ఇలాంటివి సహించనన్నారు . బుధవారం ఆయన కాకినాడలో విలే కర్లతో మాట్లాడారు . ‘ మీరు చేయని తప్పుకు ఏ విలేక రైనా బ్లాక్ మెయిల్ చేస్తే నాకు చెప్పండి . ఇలాంటి వారిపై చెప్పినా , చెప్పకున్నా చర్యలుంటాయి . పిల్లల్ని కని రోడ్డు మీదకు వదిలేసినట్లు .. కొందరు ఛానళ్లు , పేపర్లు పెట్టి విలేకర్లను రోడ్లపైకి వదిలేశారు . వారు నక్సలైట్ల మాదిరిగా అందరి దగ్గరకీ వెళ్లి బెదిరిస్తు న్నారు . గతంలో ఇసుక కొరత ఉన్నప్పుడు కొందరు లారీలకు అడ్డంగా వెళ్లి , వసూళ్లకు పాల్పడ్డారని నా దృష్టికి వచ్చింది . అలాంటి వారిని లారీతో ఢీ కొట్టే యండి , ఏమవుద్ది .. యాక్సిడెంట్ కేసేగా అన్నాను . కాకి సూచన అనుకుంటారో , సలహా అనుకుంటారో మీ నాడ , పరిసరాల్లో దందాలు చేస్తే ఊరుకోను . ఇది ఇష్టం ‘ అని ఎమ్మెల్యే సమావేశానికి హాజరైన విలేకరు లను హెచ్చరిస్తున్నట్లుగా మాట్లాడారు.

* కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. 4 నెలల పసికందును వరసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ వక్తి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడా? లేదా స్థల వివాదాలు కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రెడ్డిగూడెం పోలీసులు విచారిస్తున్నారు.