DailyDose

తెలుగు అకాడమీ కుంభకోణం ₹43కోట్లు కాదు ₹60కోట్లు-నేరవార్తలు

తెలుగు అకాడమీ కుంభకోణం ₹43కోట్లు కాదు ₹60కోట్లు-నేరవార్తలు

* తెలుగు అకాడమీ నిధులు 60 కోట్లు ఇప్పటివరకు గల్లంతైనట్లు గుర్తింపు… యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుండి 43 కోట్లు.. సంతోష్ నగర్ శాఖ నుండి ఎనిమిది కోట్లు. చందానగర్ కెనరా బ్యాంక్ శాఖ నుండి 9 కోట్లు గల్లంతు.ప్రధాన సూత్రధారి తోపాటు మరో అనుమానితుడి విచారిస్తున్న సిసిఎస్ పోలీసులు..చందానగర్ కెనరా బ్యాంక్ నుండి 9 కోట్లు ఇతరుల సహాయంతో కాజేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడి..నేడు కెనరా బ్యాంక్ సంబంధించి మరో ఫిర్యాదు దాఖలు చేయనున్న తెలుగు అకాడమీ..త్రిసభ్య కమిటీ విచారణలో బయటపడిన academy అధికారుల నిర్లక్ష్యం…జిహెచ్ఎంసి పరిధిలో10 ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 30 బ్రాంచీలలో తెలుగు అకాడమీకి చెందిన 320 కోట్ల నిధుల డిపాజిట్లు…చందానగర్ కెనరా బ్యాంకులో ఉన్న 33 కోట్ల ఎఫ్ డి లలో ఇటీవలే 20 కోట్లు విత్ డ్రా చేసిన అకాడమీ అధికారులు….నేడు 30 బ్యాంకుల శాఖల కు వెళ్లి నిధుల భద్రతను పరిశీలించనున్న తెలుగు అకాడమి అధికారుల బృందాలు తెలుగు అకాడమీ అధికారుల విచారణ పూర్తయినందున నేడు యూనియన్ బ్యాంక్ అధికారులను విచారించనున్న త్రిసభ్య కమిటీ…రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న కమిటీ.

* తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో సీసీఎస్‌ పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సంతోష్‌నగర్‌ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, సిద్ది అంబర్‌బజార్‌ అగ్రసేన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతి, సొసైటీ ఉద్యోగి మోయినుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో తెలుగు అకాడమీ అధికారుల పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నగదు బదిలీ చేసిన ఉద్యోగులతో పాటు పలువురు బ్యాంక్ ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

* దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్‌ లోని దంతెవాడ పరిధి కువకొండకు చెందిన భీమా (45) దినసరి కూలి. జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి పలు మెట్రో స్టేషన్ల వద్ద తిరుగుతున్నాడు. గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకున్న అతను అక్కడి మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజీవ్‌ చౌక్‌ వద్ద పికెట్‌ విధుల్లో ఉన్న పోలీసులు 108 వాహనంలో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు.

* దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ హెచ్ఓడీ కృపాల్ సింగ్‌ను కమిషన్ ప్రశ్నించింది. పోస్టుమార్టంకు సంబంధించి దిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుధీర్‌ను ప్రశ్నించింది. బుల్లెట్ గాయాల వల్ల నలుగురు నిందితులు చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలిందని సుధీర్ కమిషన్‌కు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమావళిని పాటించారా? లేదా? అని వైద్యుడిని అడిగింది. పోస్టుమార్టం నివేదికలోని పలు అంశాలపై కమిషన్ సభ్యులు ప్రస్తావించారు.

* అత్యాచారం కేసులో వరంగల్‌కు చెందిన ఓ కార్పొరేటర్‌ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేటర్‌ భర్త శిరీష్‌ తనను పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిల్స్‌ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 23న కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి కార్పొరేటర్‌పై అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న శిరీష్‌ను గురువారం అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించారు. నిందితుడిని పరకాల జైలుకు తరలించారు.