Editorials

భారత అటార్నీ జనరల్‌కు సొలిసిటర్ జనరల్‌కు తేడా ఏమిటి?

భారత అటార్నీ జనరల్‌కు సొలిసిటర్ జనరల్‌కు తేడా ఏమిటి?

భారతప్రభుత్వానికి ముఖ్యన్యాయ సలహదారే అటార్ని జనరల్ ఆఫ్ ఇండియా. ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ.సుప్రీంకోర్టులో 10 సం॥న్యాయవాదిగా లేదా హైకోర్టుజడ్జిగా 5 సం॥ అనుభవముండి, భారతన్యాయవ్యవస్థపై సంపూర్ణ అవగాహన వున్న వారిని రాజ్యాంగంలోని 67 (1) అధికరణం మేరకు భారతమంత్రివర్గ సలహాతో భారతరాష్ట్రపతి అటార్ని జనరల్ ను నియమిస్తాడు. రాష్ట్రపతి విశ్వాసమున్నంతకాలం మాత్రమే పదవిలో వుంటాడు.

భారత ప్రభుత్వానికి ముఖ్యన్యాయసలహాదారే కాకుండా, కేంద్రప్రభుత్వం తరపున సుప్రీం, హైకోర్టులలోని రిట్ పిటిషన్లు, అప్పిళ్ళపై హాజరై వాదనలు వినిపిస్తాడు. పార్లమెంటు సమావేశాలలో కూడా అటార్ని జనరల్ హజరైతాడు. అయితే ఓటుహక్కు వుండదు.

భారతఅటార్నిజనరల్ స్వయంప్రతిపత్తిగల వ్యవస్థ. ప్రభుత్వ, రాజకీయాల,నాయకుల ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చును.

ముఖ్యమైన విధులేమిటో చూద్దాం.

(1) భారతప్రభుత్వం తరపున సుప్రీం,హైకోర్టులలో తన వాదనలు వినిపిస్తాడు.
(2) భారతప్రభుత్వానికి అవసరమైతే న్యాయపరమైన సలహాలు ఇస్తాడు.
(3) అవసరమైతే పార్లమెంటు సమావేశాలలో పాల్గొని, సభ్యులు లేవనెత్తిన న్యాయ,చట్టపరమైన అంశాలకు సలహాలు ఇస్తాడు. అయితే ఓటింగ్ లో పాల్గొనే అధికారం లేదు.
(4) భారతరాష్ట్రపతికి పంపే బిల్లులపై అవసరమైతే సలహాలు ఇస్తాడు.
(5) భారతప్రభుత్వానికి మొదటి లా ఆఫీసరుగా పనిచేస్తాడు.

అటార్నిజనరల్‌ కు సహయకారిగా సోలిటర్ జనరల్ వుంటాడు. ఇంకా అదనపు సొలిటర్ జనరల్స్ కూడా వుంటారు. సోలిటర్ జనరల్ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైంది కాదు, భారతప్రభుత్వం చట్టం మేరకు ఇది ఏర్పడింది.సోలిటర్ జనరల్ పదవి అటార్ని జనరల్‌ పదవికంటే కిందిస్థాయిలో (subordinate) వుంటుంది.

మొదటి అటార్నిజనరల్ గా Srl. Mothilal Chimanlal Setalvad 28.1. 1950 నుండి మార్చి 1963 వరకు పనిచేశాడు. ఇతను 13 సంవత్సరాలకాలంపాటుగా ఆ పదవిలోవున్నాడు.
ప్రస్తుత భారతఅటార్ని జనరల్ గా కేరళ రాష్ట్రానికి చెందిన. శ్రీ. KK వేణుగోపాల్ వున్నాడు.ఇతను 1.7.2017న ఆ పదవిలో నియమించబడ్డాడు.

మొదటి సోలిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా Sri. Chander Kishan Dapthary గా పనిచేశాడు. ప్రస్తుతం సోలిటర్ జనరల్ గా శ్రీ. తుషార్ మెహత పని చేస్తున్నారు.

రాష్ట్రప్రభుత్వానికి అడ్వోకేట్ జనరల్ వుంటాడు. ఇది కూడా రాజ్యాంగబద్ధమైన పదవే. రాష్ట్రమంత్రివర్గ సిఫారసు మేరకు రాష్ట్రగవర్నరు నియమిస్తాడు. తొలగించే అధికారం కూడా రాష్ట్ర గవర్నరుదే. హైకోర్టులో కనీసం పదిసంవత్సరాలుగా న్యాయవాదిగా పని చేసివుండాలి. ఇతని కింద గవర్నమెంట్ ప్లీడరులు (GPs), పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PPs) వుంటారు.

శ్రీ.D. నరసరాజు (1956 – 63) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి అడ్వోకేట్ జనరల్. ప్రస్తుతం శ్రీ.సుబ్రమణ్యం శ్రీరాం ఆంధ్రప్రదేశ్ AGగా పనిచేస్తున్నారు.