Politics

ఏపీలో దసరాకు ఓకే. మోత్కుపల్లితో కేసీఆర్ చెట్టాపట్టాల్-తాజావార్తలు

ఏపీలో దసరాకు ఓకే. మోత్కుపల్లితో కేసీఆర్ చెట్టాపట్టాల్-తాజావార్తలు

* ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ …దసరా ఉత్సవాలకు అనుమతి ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది.దసరా ఉత్సవాలకు సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది.ఈ మేరకు రాష్ట్రంలో దసరా ఉత్సవాలకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.కాగా, దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన జారీ చేశారు.అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే భక్తులందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.అలాగే, విజయవాడ ఇంద్రకీలాద్రీపై జరగనున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు.

* తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్

* దళిత బంధు చైర్మన్ గా మోత్కుపల్లి నర్సింహులు.మరో మూడు నాలుగు రోజుల్లో టీఆరెస్ లో చేరనున్న నర్సింహులు.టీఆరెస్ లో చేరిక అనంతరం ప్రకటించనున్న సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం.ఇవాళ ఉదయం అసెంబ్లీకి స్వయంగా వెంటబెట్టుకొచ్చిన సీఎం కేసీఆర్.ఉదయం నుండి సీఎం కేసీఆర్ తోనే అసెంబ్లీలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు.

* శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం 1.81 కోట్లు

* ఉపాధి హామీ పనుల పెండింగ్‌ బిల్లులపై హైకోర్టు తీర్పు…1,013 పిటిషన్లపై తీర్పు వెలువరించిన హైకోర్టు..నాలుగు వారాల్లోగా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ఆదేశం…20 శాతం తగ్గించి చెల్లిస్తామన్న ప్రభుత్వ జీవో కొట్టివేస్తూ తీర్పు…బకాయిలను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం.

* MAA ఎన్నికలను బ్యాలెట్​ విధానంలో నిర్వహించాలని ఎన్నికల అధికారికి లేఖ వ్రాసిన మంచు విష్ణు…ఈవీఎంలపై తమ ప్యానెల్‌ సభ్యులకు నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.

* తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

* స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి..ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి.అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు.75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి..కానీ గణనీయమైన మార్పులు రాలేదు. దళిత బంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదు. 1986లోనే పురుడు పోసుకుంది’ అని తెలిపారు.

* ప్రభుత్వ నియామకాల్లో గరిష్ట వయో పరిమితి పెంపును కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు మరో ఏడాదిపాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

* కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనా తీరు ఆది నుంచి అనుమానాస్పదంగానే ఉంది. చాలా రోజులపాటు వైరస్‌ వ్యాప్తి విషయాన్ని చైనా కప్పిబెట్టి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందనే వాదనకు బలం చేకూర్చే సాక్ష్యాలను ఓ సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ పరిశోధన ప్రకారం వుహాన్లో తొలికేసు వెలుగురావడానికి కొన్ని నెలల ముందు నుంచే అక్కడి ల్యాబ్‌లు పీసీఆర్‌ పరీక్ష పరికరాలను భారీగా కొనుగోలు చేసినట్లు తేలింది. ఆస్ట్రేలియా-అమెరికాకు చెందిన ‘ఇంటర్నెట్‌ 2.0’ అనే సంస్థ ఈ పరిశోధన నిర్వహించింది. ఈ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ ఎనాలసిస్‌లో అందెవేసిన చేయి.

* కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ హామీ ఇచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు తమను ప్రమోట్‌ చేయడానికి సహకరించాలని ఇటీవల బండి సంజయ్‌ను కోరారు. ఈమేరకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విద్యార్థుల విద్యాసంవత్సరం వృథా కాకుండా ఆదుకోవాలని బండి సంజయ్‌ సెప్టెంబరు 9న మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విద్యార్థుల అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని సంజయ్‌ తెలిపారు.

* ప్రాణహిత చేవేళ్ల పథకానికి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) రూపకల్పన చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ప్రాణహితకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని అడిగితే కాళేశ్వరం అని పేరు పెట్టారని జానారెడ్డి ఆక్షేపించారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద జానారెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, విజయశాంతి, కె.కేశవరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. పది మందికి ఉపయోగపడాలనే కాకా ఆశయాలను ఆయన కుటుంబసభ్యులు కొనసాగించడం అభినందనీయమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తమకెన్నో నేర్పించి దిక్సూచిగా నిలిచారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

* ఏపీలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘‘పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం, వ్యవసాయ మంత్రి విఫలయ్యారు. ప్రభుత్వ లెక్కలు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉంది. రాయలసీమలో ఉల్లి, టమాటా, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దారుణంగా పడిపోయింది. కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఇవన్నీ చాలవన్నట్లు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు.

* వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీలో రసాభాస జరిగింది. పంపిణీ చేస్తున్న చీరలు నాణ్యతగా లేవని మహిళలు మాట్లాడుకుంటుండగా.. ఇష్టం ఉంటే తీసుకోవాలని లేకపోతే వెళ్లిపోవచ్చని ఎంపీపీ మౌనిక అన్నారు. ఎంపీపీ వ్యాఖ్యలతో ఆగ్రహించిన మహిళలు చీరలు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి స్పందనతో అవాక్కైన ప్రజాప్రతినిధులు వెనక్కి రమ్మని పిలిచినా వారు పట్టించుకోకుండా వెనుదిరిగారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలు చీరలు తిరస్కరణ వైరల్‌గా మారింది.