Movies

అంధాధున్‌తో 80శాతం చూపు నాశనం చేసుకున్న ఆయుష్మాన్ ఖురానా

అంధాధున్‌తో 80శాతం చూపు నాశనం చేసుకున్న ఆయుష్మాన్ ఖురానా

అంధాధున్‌లో ఆయుష్మాన్‌ ఖురానాకు మేకప్‌, ప్రొస్థెటిక్ డిజైనర్‌గా పనిచేసిన ప్రీతీ షీల్‌ సింగ్‌ మరో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ మిగిలిన చిత్రాల్లో వినియోగించేంత భారీ ప్రొస్థెటిక్‌ ఏమీ ఇందులో వాడలేదు. కాకపోతే ఆయుష్మాన్‌ బ్లైండ్‌ లుక్‌ కోసం స్పెషల్‌ లెన్స్‌ని తెప్పించాము. ఆ పాత్రలో సహజంగా కనిపించేందుకు ప్రత్యేకించి తయారు చేయించాం. అయితే ఇవి మార్కెట్‌లో దొరికే సాధారణ లెన్స్‌ కావు. వీటని ‘సెక్లెరల్ లెన్స్’ అంటారు. రెండు కళ్లకు వాడే ఈ లెన్స్‌ ధర రూ.6లక్షలు ఉంటుంది. ఇది మీ కళ్లు.. కనిపించే భాగాన్ని కవర్ చేస్తుంది. తద్వారా చూపు అంతా మసకబారిపోతుంది. ఈ సమస్యలు ఉంటాయని తెలిసినా సరే.. ఆయుష్మాన్‌ ఒప్పుకుని మాకు బాగా సహకరించేవాడు. ఇక సెక్లెరల్ లెన్స్ ధరించాక ఆయుష్మాన్‌ 80శాతం చూపు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి తోడు బ్లాక్‌ గ్లాసెస్‌ ధరించడంతో 90శాతం ఆయన చూపు దెబ్బతింది. అలానే సినిమా షూట్‌ మొత్తం పూర్తి చేశాం.