Politics

దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో ₹20వేల కోట్లు ఇస్తా

దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో ₹20వేల కోట్లు ఇస్తా

ఉద్యమ స్ఫూర్తితో దళితబంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకం అమలవుతుందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడంలేదన్నారు. దీని ద్వారా లబ్ధిపొందే కుటుంబాలకు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు అన్నీ యథావిధిగా అమలవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలో బీసీ కుల గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపుతుందని ప్రకటించారు. దళితుల జనాభా పెరిగిన నేపథ్యంలో వారికి రిజర్వేషన్లను పెంచాలని అన్నారు. దళితబంధు పథకం నాలుగు దశల్లో అమలు కానుండగా రూ.1.8 లక్షల కోట్లను వ్యయం చేయనున్నటు వివరించారు. ప్రతి జిల్లాలో నాలుగువేల కోట్ల రూపాయలతో కలెక్టర్ల వద్ద దళిత రక్షణనిధి ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు ఎంపిక చేసిన 4 మండలాల్లో వందశాతం దళిత కుటుంబాలకు పథకం అమలవుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ప్రయోజనం అందుతుందన్నారు. ఆ వందమందిని ఎంపికచేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. శాసనసభలో మంగళవారం దళితబంధుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘హుజూరాబాద్‌ ఎన్నిక కోసం ఈ పథకం రాలేదు. 1986 నుంచీ దళిత అభ్యున్నతిపై దృష్టి సారించా. గత ఏడాదే అమలుకావాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్న ఈపథకం రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. అన్ని ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.