అట్లాంటాలో పీవీ విగ్రహ ప్రతిష్టాపనపై సమావేశం. పాల్గొన్న చైర్మన్ కేశవరావు మరియు పీవీ కమిటీ సభ్యులు. అమెరికన్ ఇండియన్ అసోసియేషన్ తరపున పాల్గొన్న డా.పాడి శర్మ. అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటులో భాగంగా నేడు పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అధ్యక్షతన కమిటి సభ్యులు పీవీ ప్రభాకర్, మహేష్ బిగాల, చంద్రశేఖర్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సమావేశములో విగ్రహాన్ని ఇండియా నుంచి తరలించడం, తేదీ వివరాలు, కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించారు. అతిథుల వివరాలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు తదితరాదులపై ప్రసంగించారు. అమెరికావ్యాప్తంగా ఉన్న పీవీ అభిమానులు, తెలంగాణా ప్రముఖులు, పీవీ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇతర దేశాల్లో పీవీ విగ్రహ ఏర్పాటుపై కేసీఆర్‌తో చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
అట్లాంటాలో పీవీ విగ్రహ ఏర్పాటుపై సమావేశం
Related tags :