Politics

ఆదిమూలపుకు సుప్రీంలో చుక్కెదురు. ధూళిపాళ్లకు మరో కొత్త చిక్కు-నేరవార్తలు

ఆదిమూలపుకు సుప్రీంలో చుక్కెదురు. ధూళిపాళ్లకు మరో కొత్త చిక్కు-నేరవార్తలు

* మంత్రి అదిములపు సురేష్ దంపతులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు.

* తెదేపా నేత ధూళిపాళ్లకు కాకినాడ పోలీసుల నోటీసులు.చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చి నోటీసులిచ్చిన పోలీసులు.డ్రగ్స్‌ రవాణాపై ప్రభుత్వంపై విమర్శలు చేసిన నరేంద్ర.విచారణకు వచ్చి ఆధారాలు ఇవ్వాలని ధూళిపాళ్లకు నోటీసులు.

* ఈరోజు శ్రీనగర్‌లో జరిగిన దారణం వివరాలు.ముస్లిం ఉగ్రవాదులు ఒక స్కూలులో చొరబడి ప్రిన్సిపాల్ మరియు ఒక అధ్యాపకుడిని కాల్చి చంపారు.ఉగ్రవాదులు కాలేజీలోకి ప్రవేశించి స్టాఫ్ మీటింగ్‌లో ఉన్న ప్రిన్సిపాల్‌ను , అధ్యాపకులను చేరుకుని , లైన్‌లో నుంచో బెట్టి అందులో ముస్లింలు ఎవరో identity card ద్వారా తెలుసుకుని వారిని వేరుచేసి ముస్లిమేతరులైన ప్రిన్సిపాల్ ( సిక్కు మహిళ) ను & హిందూ అధ్యాపకుడిని కాల్చి చంపారు.

* హెరాయిన్ డ్రగ్స్ స్మగ్లింగ్ తో ఏపీకి సంబంధం లేదన్న కేంద్ర హోంశాఖ..!గమ్యస్థానం ఢిల్లీ అని NIA రిపోర్ట్ ఆధారంగా క్లారిటీ..డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదన్న కేంద్రం హెరాయిన్ గమ్యస్థానం ఢిల్లీ అని నిర్ధారణ..నిఘా వర్గాలను బురిడీ కొట్టించేందుకు విజయవాడ అడ్రస్ వాడినట్టు నిర్ధారణ..ఇప్పటికే ఎన్ఐఏకి డ్రగ్స్ కేసు అప్పగింత..ఏపీకి డ్రగ్స్ తో సంబంధం లేదన్న ఎన్ఐఏ..సుధాకర్ దంపతులను కమిషన్ ప్రాతిపదికన వాడుకున్న ఆఫ్ఘన్ ముఠా..ఆషి ట్రేడర్స్ అడ్రస్ వాడుకునేందుకు అనుమతి.

* తూ.గో.జిల్లా గోకవరం (మం) రంపఎర్రంపాలెం లో ఏసీబీ వలకు చిక్కిన పంచాయతీ సెక్రెటరీ హనుమంతరావు..సిసి రోడ్డు పెండింగ్ బిల్లుకు సంబంధించి 21,000 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.