NRI-NRT

20మంది పేద విద్యార్థులకు డాలస్ ప్రవాసాంధ్రుడి తోడ్పాటు

20మంది పేద విద్యార్థులకు డాలస్ ప్రవాసాంధ్రుడి తోడ్పాటు

డాలస్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు జిల్లెళ్ళమూడి వెంకట్ గుంటూరు జిల్లా పుల్లడిగుంటలోని మలినేని ఇంజినీరింగ్ కళశాలకు చెందిన 20మంది పేద విద్యార్థులకు లాప్‌టాప్‌లను అందజేశారు. వెంకట్ తల్లిదండ్రులు తిరుపతయ్య-గోవిందమ్మల చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు వీటిని అందజేశారు. పుల్లడిగుంట గ్రామ ప్రముఖులు ఉప్పుటూరి చిన్నరాములు-సీతామహాలక్ష్మిలు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. మలినేని కళాశాల చైర్మన్ డాక్టర్ మలినేని పెరుమాళ్ళు వెంకట్ తల్లిదండ్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ జె.కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. తానా ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.