DailyDose

అత్త ఇంటిని దోచుకున్న అల్లుళ్లు-నేరవార్తలు

అత్త ఇంటిని దోచుకున్న అల్లుళ్లు-నేరవార్తలు

* కొమరాడ మండల కేంద్రంలో సొంత అత్త ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు అల్లుళ్లు. అడిగినప్పుడు అత్త డబ్బులు ఇవ్వకపోవడంతో అత్త లేని సమయంలో చోరీ. చోరీకి సంబంధించిన 8 తులాల బంగారం, 20 వేల నగదు తో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.ఫిర్యాదు మేరకు వారం రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులు.

* విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రం పుణ్యగిరి రోడ్లో అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ దొంగలు బీభత్సం. 15 నుండి 20 బైక్ ల వరకు పెట్రోల్ పైపులు కోసేసి పెట్రోలు దొంగతనం టిఫిన్ కొట్టు ముందు నిద్రిస్తున్న వ్యక్తి వద్ద వున్న హ్యాండ్ రైడ్ మొబైల్ ఫోన్ ను దొంగలు దోచుకెళ్లారు. దీంతోఒక్కసారిగా పుణ్యగిరి రోడ్డులో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలలో పున్యగిరి రోడ్డులో రాత్రి సమయంలో మద్యం సేవించి బైక్ పై రేస్ డ్రైవింగు చేస్తూ మహిళలుపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం . ఇదేమిటి అని ఎవరైనా కాలనీ వాసులు ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగడం వంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని ఇటువంటి వారిపై పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.

* ఇద్దరు పసిపిల్లలను ఉరివేసి హత్య చేసిన కసాయి తల్లి.ఈ ఘటన రాజమహేంద్రవరం ఆనంద నగర్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

* లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు పట్టుకున్నారు. శనివారం రాత్రి రాజమహేంద్రవరం లాలాచెరువు కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రకు వెళుతున్న లారీలో 47 బస్తాల గంజాయిని గుర్తించినట్లు సెబ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.రాంబాబు తెలిపారు. లారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన సయ్యద్‌ ఇబ్రహీం, నకల్‌ కైలాస్‌ గైక్వాడ్‌ను అరెస్టు చేశామన్నారు. మొత్తం 1031.680 కిలోల గంజాయి ఉందని, విలువ రూ.కోట్లలో ఉంటుందని తెలిపారు. తనిఖీల్లో ఇంటెలిజెన్స్‌ ఎస్సై వి.రామకృష్ణ, సెబ్‌ ఎస్సైలు పాల్గొన్నారు.

* బాలీవుడ్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు సోమవారం కూడా బెయిల్ దొరకలేదు. ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా ముంబయి కోర్టు మూడోసారి బెయిల్ నిరాకరించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆర్యన్ గత వారం రోజులుగా ముంబయి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) తన స్టేట్‌మెంట్‌ను కోర్టుకు సమర్పించిన తర్వాత బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

* తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ వద్ద ఘటన జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతడిని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగి నర్సింహారెడ్డిగా గుర్తించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.