Sports

యువరాజ్ అరెస్ట్

భారత క్రికెట్‌ జట్టు మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఒక కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆదివారం అరెస్ట్‌ అయిన అతడు.. వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. నిరుడు జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ వీడియోలో క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌తో మాట్లాడుతూ కుల వివక్ష వ్యాఖ్యలు చేశాడన్నది అతడిపై ఆరోపణ. పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం యువీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడిని పూచీకత్తుపై వదిలిపెట్టారు.