DailyDose

90ఏళ్ల నరసరావుపేట వృద్ధురాలి ₹20కోట్ల భూమి కాజేశారు-నేరవార్తలు

90ఏళ్ల నరసరావుపేట వృద్ధురాలి ₹20కోట్ల భూమి కాజేశారు-నేరవార్తలు

* ఎల్లారెడ్డిగూడలో యువకుడి కిడ్నాప్…..గ్రామంలో ఉన్న విలువైన భూమిని కారు చౌకగా ఇచ్చేయాలని కొంతకాలంగా బెదిరింపులు!

* అనుమానంతో కత్తి తీసుకుని భార్య షేక్ సాధికా(25) గొంతుకోసిన భర్త షేక్ బాజీ(35).నిన్న రాత్రి 10.00 సమయంలో అమరావతి బస్టాండ్ సెంటర్ వద్ద నివాసం ఉండే భార్యాభర్తల మధ్య ఘర్షణ.ఆవేశంతో భార్య సాధికా గొంతుకోసి పరారైన భర్త బాజీ.సాధికా పరిస్తితి విషమం గుంటూరు జీజీహెచ్ కు తరలింపు.

* విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధి అగనంపూడి వద్ద ఇటీవల జరిగిన మైనర్ బాలిక పాండ్రంకి పావని మృతి కేసుపై ఏపీ మహిళా కమిషన్ దృష్టి సారించింది. బాలిక మృతికి సంబంధించిన కారణాలపై విచారణ నివేదిక కోరుతూ విశాఖ పోలీసు కమిషనర్ కు సోమవారం లేఖ రాసింది. పావని మృతి సంఘటన రోజే ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. కమిషన్ సభ్యురాలు సైతం ఘటనాస్థలికి వెళ్ళి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు వెల్లడించిన సమాచారం… అనంతరం బాలిక మృతిపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఈ విషయంపై మరోమారు స్పందించారు. బాలిక మృతి ఆత్మహత్యనా.. హత్యనా అనే విషయంలో వాస్తవాలను నిగ్గుతేల్చాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు భద్రతపై నమ్మకం కల్పించేందుకు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. 

* కృష్ణాజిల్లా మైలవరం :మండలంలోని వెదురుబిడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది..కుటుంబ కలహాలతో అల్లుడు కత్తితో దాడి..నలుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం..108 లో విజయవాడ తరలింపు..వివరాలను పరిశీలిస్తే వెదురుబిడెం గ్రామానికి చెందిన కొలుసు కొండలరావు (40)కు ముగ్గురుకుమార్తెలు మొదటి కుమార్తె ధనలక్ష్మికు గన్నవరం మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన వీర్ల రాంబాబు( 30)తో 4 సంవత్సరాల క్రితం వివాహమైంది..వారికి ఒక పాప ఒక బాబు పెళ్లి సమయంలో ఇచ్చిన భూమిని అమ్మమని ప్రతిరోజు గొడవ జరుగుతుండేది..ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మూడు గంటల సమయంలో ధనలక్ష్మి పుట్టింటికి వచ్చింది..

* నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై వైకాపా నేత చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.ఎంపీపీ పదవులకు ఎమ్మెల్యే టికెట్ వెలకట్టి అమ్మేశారని ధ్వజమెత్తారు.వింజమూరు మండల కన్వీనర్ పదవిని 6 నెలల్లో ముగ్గురికి కేటాయించారన్న సుబ్బారెడ్డి జడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50 లక్షలు ఇచ్చామని చెప్పారు.8 మంది దళారులను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారని మండిపడ్డారు.

* రూ.20 కోట్లు విలువ చేసే 9 ఎకరాల పొలం మార్చుకున్నారని ఆరోపణ బతికున్న వృద్ధురాలిని చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి ఆమెకున్న సుమారు రూ.20కోట్ల ఆస్తిని కాజేసిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఇస్సపాలెంలో జరిగింది.ఇస్సపాలెంకు చెందిన బండ్లమూరి వెంకాయమ్మ (90) అనే వృద్ధురాలికి సుమారు రూ.20 కోట్లు విలువ చేసే తొమ్మిది ఎకరాల పొలం ఉంది.ఆస్తి కాజేసేందుకువరుసకు ఆమెకు మనవడైన బండ్లమూరి కోటయ్య అనే వ్యక్తి 2018లో వెంకాయమ్మ చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించాడు.2020లో వృద్ధురాలి ఆస్తిని తప్పుడు ధృవపత్రాలతో కోటయ్య తన పేరుపైకి మార్చుకున్నట్లు వెంకాయమ్మ నరసరావుపేట ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.