Politics

ఏపీలో తెదేపా కార్యాలయంపై దాడులు

ఏపీలో తెదేపా కార్యాలయంపై దాడులు

ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో చంద్రబాబు హుటాహుటిన బయల్దేరారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ – టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు – దాడి విషయం తన దృష్టికి రాలేదన్న అమిత్ షా – పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ – టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తి – ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్ షా హామీ

అమరావతి టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసిపి కార్యకర్తలు దాడి. టిడిపి కేంద్ర కార్యాలయం లోకి చొచ్చుకుని వచ్చిన వైసిపి మహిళా కార్యకర్తలు.

సీఎం జగన్ పై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసు ముట్టడి. పట్టాభి తక్షణమె క్షమాపణ చెప్పాలని డిమాండ్. దాడి సమయంలో టీడీపీ ఆఫీసులో ఉన్న పట్టాభి. వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడికి దిగడంతో టీడీపీ ఆఫీసు నుంచి పరుగులు తీసిన సిబ్బంది. దాడిలో పలువురు టీడీపీ నేతలకు గాయాలు. ఆఫీసులో కార్లు, ఫర్నిచర్ ధ్వంసం. దాడిని పోలీసులు అడ్డుకోలేదని లారీ కింద పడి కార్యకర్త ఆత్మహత్య యత్నం.

విజయవాడలోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడిచేసిన వైకాపా శ్రేణులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. వైకాపా మహిళా కార్యకర్తలు విశాఖలోని తెదేపా కార్యాలయంలోకి  చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి  యత్నించారు. దీంతో పోలీసులు వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నినాదాలు చేశారు. తెదేపా నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు.