DailyDose

మావోయిస్ట్ అగ్రనేతలపై విషప్రయోగం-నేరవార్తలు

మావోయిస్ట్ అగ్రనేతలపై విషప్రయోగం-నేరవార్తలు

* తెలుగు అకాడమీ కేసులో మరొకరి అరెస్టు.. 16కు చేరిన తెలుగు అకాడమీ అరెస్టుల సంఖ్య.. బ్యాంకు నుంచి డబ్బులు కొల్లగొట్టాలని ప్లాన్ కృష్ణారెడ్డిదే.. సాయి కుమార్ కు సలహా ఇచ్చినందుకు రెండున్నర కోట్లు తీసుకున్న కృష్ణారెడ్డి.. మొదట్లో కృష్ణారెడ్డి సాయికుమార్ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ల కొల్లగొట్టడం పై సమావేశాలు. పెద్ద మొత్తంలో వాటాను డిమాండ్ చేయడంతో కృష్ణా రెడ్డి పక్కన పెట్టిన సాయి కుమార్.

* మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు ముప్పేట దాడికి సిద్ధమయ్యారు. హిడ్మాపై విషప్రయోగం జరగ్గా.. వైద్యం కోసం తెలంగాణకు వచ్చాడని కొన్నివర్గాలు, ఆర్కే మృతికి కారణాలను ఆరా తీసేందు కు వచ్చాడని మరికొన్ని వర్గాలు చె బుతున్న విషయం తెలిసిందే. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి ఇంద్రావతినది పరీవాహక ప్రాంతం మీదగా భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోకి మావోయిస్టు బృందాలు ప్రవేశించాయనే ప్రచారం జరుగుతోంది. పలిమెల, మహాదేవపూర్‌, మహాముత్తారంతోపాటు.. ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపే ట అడవుల్లో హిడ్మా తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎల్‌జీఏ నేత కావడంతో హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉం టుంది. అంటే.. కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు అతనికి కాపలాగా ఉంటారు. మరోవైపు హిడ్మా తన బృందంతో భూపాలపల్లి, ములుగు జిల్లా సమీపంలో గోదావరితీరం దాటి ఉండొచ్చనే అనుమానాలు పోలీసువర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మహదేవపూర్‌-ఏటూరునాగారం ఏరియా కమిటీ హిడ్మాకు ఆశ్రయం ఇచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని అడవి ప్రాంత ఆర్‌ఎంపీలు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచారు. ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోనూ కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా దళంలోని కొందరు వ్యక్తులు స్లోపాయిజన్‌ ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కూడా కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. తదనంతర లక్షణాలతోపాటు, తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డారని తెలుస్తోంది. విష ప్రయో గం మెల్లిమెల్లిగా శరీర భాగాలపై ప్రభావం చూపించిందని, ఊపిరితిత్తుల, మూత్రపిండాల సమస్యలకు అదే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికీ మించి, ఉన్నఫళంగా నరాల బలహీనత సమస్య ఆర్కేను తీవ్రంగా వేధించిందని సమాచారం. హిడ్మాలో కూడా క్రమంగా ఇలాంటి లక్షణాలే బయటపడుతున్నాయని, నరాల సమస్య ప్రారంభమవ్వడంతో.. విషప్రయోగంపై అప్రమత్తమై చికిత్సకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

* శంషాబాద్‌ విమానాశ్రయంలో 6 కిలోల బంగారాన్ని మంగళవారం కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా బంగారం ఉన్నట్టు గుర్తించి అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌లైట్‌లో 6 కిలోల బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు అంచనావేశారు.

* పదకొండేళ్ల బాలికపై ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూలో ఈ అమానవీయ ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే కీచకుడిలా మారాడు. ఇందులో మరో ఇద్దరు ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.