NRI-NRT

పుల్లడిగుంటలో ప్రవాసాంధ్రుడి సహకారంతో వైద్యశిబిరం

పుల్లడిగుంటలో ప్రవాసాంధ్రుడి సహకారంతో వైద్యశిబిరం

విజయవాడ టాప్ స్టార్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నాడు నిర్వహించారు. వర్జీనియాకు చెందిన ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్ చౌదరి తన స్వగ్రామంలో ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారాన్ని అందించారు. అనంతరం ఆ గ్రామానికి చెందిన పది మంది చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అందజేశారు. గ్రామంలోని పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. టాప్ స్టార్స్ ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులు, 20 మంది సిబ్బంది రోగులకు ఉచితంగా పరీక్షలు, మందులను అందజేశారు.