Business

మహిళా ఉద్యోగులకు స్విగ్గీ మంచి నిర్ణయం-వాణిజ్యం

మహిళా ఉద్యోగులకు స్విగ్గీ మంచి నిర్ణయం-వాణిజ్యం

* ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.దిల్లీలో పెట్రోల్​, డీజిల్​ ధరలు 35 పైసలు పెరిగాయి. లీటర్​ పెట్రోల్​ ధర రూ.106.89కు చేరగా.. డీజిల్​ ధర రూ.95.63కు పెరిగింది.ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 33 పైసలు పెరిగి రూ.112.74కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర 38 పైసలు పెరిగి రూ.103.60 వద్ద కొనసాగుతోంది.కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.107.07గా ఉంది. లీటర్​ డీజిల్ ధర రూ.98.35 వద్ద కొనసాగుతోంది.చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి రూ.103.58 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు​ రూ.99.56కు చేరింది.హైదరాబాద్​లో పెట్రోల్ ధర 36 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ రూ.111.14కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​ రూ.104.28 కి చేరింది.

* జీఎస్టీ కౌన్సిల్‌ 45వ సమావేశాన్ని గురువారం వర్చువల్‌లో నిర్వహించారు.ఐటీ సవాళ్లు, ఆదాయ సమీకరణపై జీఎస్టీ విధానంలో సంస్కరణల కోసం కన్వీనర్‌, ఏడుగురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.దీనికి కన్వీనర్‌గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఉండగా, సభ్యుడిగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి ఎంపికయ్యారు.వర్చువల్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్‌ హాజరయ్యారు.కచ్చితమైన డేటా, వ్యాపార లావాదేవీల సమగ్ర విశ్లేషణ, నకిలీ ఇన్వాయిస్‌ల తగ్గింపు, పన్ను ఎగవేతను తగ్గించడం, నియంత్రణ అధికారులు-పన్ను చెల్లింపుదారుల మధ్య సమాచారాన్ని పంచుకోవడంలాంటి అంశాలను వివరించారు.

* అమెజాన్‌ ప్రైమ్‌ ఫీజు పెంపు-వార్షిక సభ్యత్వం రూ.1,499, నెలసరి రూ.179న్యూఢిల్లీ: అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ల ఫీజుల్ని సంస్థ భారీగా పెంచింది.ఇండియాలో ఆఫర్‌చేసే ప్రైమ్‌ ప్రొగ్రామ్‌లకు వార్షిక సభ్యత్వ ఫీజును రూ.999 నుంచి 50 శాతం పెంచడంతో ఇక నుంచి రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది.నెలవారీ సభ్యత్వ ఫీజు రూ.129 నుంచి రూ.179గా అమెజాన్‌ నిర్ణయించింది.అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగినవారు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కంటెంట్‌ను వీక్షించే అవకాశంతో పాటు సంస్థ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో కొనుగోలుచేసే ఐటెమ్స్‌ను ఒకరోజులోనే డెలివరీ అందుకునే సౌలభ్యం ఉంటుంది.మూడు నెలల ప్లాన్‌ను రూ.329 నుంచి రూ.459కు పెంచారు. పెంచిన ఫీజు త్వరలోనే అమల్లోకి వస్తుందని, తేదీని తదుపరి ప్రకటిస్తామని అమెజాన్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు.

* నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే నెలసరి వంటి వ్యక్తిగత సమస్యతో కొన్నిసార్లు మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆ రోజుల్లో సెలవు అడగాలంటే కారణం ఏం చెప్పాలో.. చెబితే ఏం అనుకుంటారో అన్న అనుమానం. మహిళలకు ఎదురయ్యే ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ తన వద్ద పనిచేసే డెలివరీ విమెన్‌ సౌకర్యార్థం మంచి నిర్ణయం తీసుకుంది. మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్‌ షా తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించారు.