Politics

వైకాపా గూండాలు మిగలరు-నేరవార్తలు

వైకాపా గూండాలు మిగలరు-నేరవార్తలు

* న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈకేసులో తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన సీఐడీ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వేర్వేరుగా ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ తాజాగా ఆరుగురిని అరెస్టు చేసింది. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

* ఎయిర్ ఇండియా ఫైలెట్ ని మోసం చేసిన సైబర్ చీటర్స్..కేవైసి అప్డేట్ పేరుతో 10.30 లక్షల మోసం.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎయిర్ ఇండియా ఫైలెట్ ప్రభాకర్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* అనుమానం పెను భూతం అయింది. కట్టుకున్న భార్యను అనుమానించి, తనకు పుట్టిన రెండు మాసాల కన్న కూతురికి తన పోలికలు రాలేదని, అనుమానంతో ,అభం – శుభం తెలియని చిన్నారి బాలికను, కన్నతండ్రి కసాయిగా కడతేర్చిన హృదయ విదారక సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటు చేసుకుంది.

* రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు

* నిరసన దీక్షలో పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు….ఇన్నాళ్లు తామంతా చాలా ఓపిగ్గా ఉన్నామని.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను చూస్తూ ఇక ఓపికతో ఉండలేమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెదేపా తిరిగి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గంట పాటు కళ్లు మూసుకుంటే చాలని అన్నారు.గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా అధికారంలోకి వచ్చాక శాంతంగా ఉండమని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారని అన్నారు.ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని మండిపడ్డారు.పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతున్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదన్నారు.

* తాడేపల్లి 12,13వార్డ్ సచివాలయం అడ్మిన్ కిశోర్ పై మహిళా పోలీస్ నాగ పద్మజ ఫిర్యాదు.దిశా యాప్ ద్వారా సచివాలయం అడ్మిన్ కిషోర్ పై ఫిర్యాదు చేసిన సచివాలయం మహిళా పోలీస్.గతంలో అడ్మిన్ కిషోర్ పై అనేకసార్లు ఫిర్యాదులు.గతంలో అనేక మార్లు ఎడ్మిన్ కిషోర్ ప్రవర్తన పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు.సచివాలయం అడ్మిన్ కిషోర్ పై తాడేపల్లి వాలెంటర్ల్లు సచివాలయ ఉద్యోగులు పలు ఆరోపణలు పలు విమర్శలు.మహిళా పోలీసు వెంకటరమణ ఫిర్యాదు పై స్పందించిన తాడేపల్లి పోలీసులు అడ్మిన్ కిషోర్ అరెస్ట్.