Health

ఇష్టం వచ్చినట్లు ఇన్సులిన్ వాడితే క్యాన్సర్ వస్తుంది

అశాస్త్రీయంగా తీసుకునే ఇన్సులిన్‌ డోసులతో మనిషి శరీరంలోని కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వంటి రుగ్మతలకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదని తెలిపారు. ‘హెచ్చుతగ్గులతో ఇన్సులిన్‌ డోసులను ఇచ్చినప్పుడు మనిషి శరీరంలోని కణాలు ఏ విధంగా స్పందిస్తాయనే’ విషయంపై హైదరాబాద్‌లోని టీఐఎఫ్‌ఆర్‌ బయోలజికల్‌ డిపార్టుమెంట్‌ ఆచార్యుడు ఉల్లాస్‌ కొల్తూరు నేతృత్వంలో, పరిశోధక విద్యార్థిని నమ్రతా శుక్లా, ఐఐటీ-బాంబే ఆచార్యుడు రంజిత్‌ పాడిన్‌హతిరీ సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు. వీరి పరిశోధన ఫలితాలు అమెరికాలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తాజాగా ప్రచురించింది.