NRI-NRT

జాషువ “పిరదౌసి”పై టాంటెక్స్ సాహిత్య సదస్సు

జాషువ “పిరదౌసి”పై టాంటెక్స్ సాహిత్య సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా 171వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి దసరా శుభాకాంక్షలతో కార్యక్రమం ప్రారంభమయింది. సాహితి వేముల, సిందూర వేముల ప్రార్థనా గీతం ఆలపించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ వైదేహి శశిధర్ పాల్గొన్నారు. ఉపద్రష్ట సత్యం ముఖ్యఅతిథిని సభకు పరిచయం చేశారు. వైదేహి శశిధర్ జాషువా ప్రఖ్యాత లఘు కావ్యం “పిరదౌసి”లోని పద్యాలను విశ్లేషించారు. లెనిన్ వేముల సరస్వతీ దేవిని స్తుతించే పద్యాలు ఆలిపించారు. “పద్య సౌగంధం” శీర్షికన ఉపద్రష్ట సత్యం కృష్ణదేవరాయలి “ఆముక్తమాల్యద” నుండి పద్యం యొక్క తాత్పర్య విశేషాలు విశ్లేషించారు. డా.యు. నరసింహారెడ్డి పొడుపుకథలు, ప్రహేళికలు, ప్రశ్నలు, కొమరవోలు సరోజ “దీపతోరణం” అనే వంద మంది రచయిత్రుల కథా సంకలనం, మాసానికో మహనీయుడు శీర్షికన ఈ మాసంలో జన్మించిన విశిష్ట రచయితలను అరుణ జ్యోతిలు ప్రసంగించారు. నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పచ్చి అతిథులకు జ్ఞాపికలు చదివి వినిపంచారు.