DailyDose

పోలీసులు పిలిస్తే 41A నోటీసు ఇవ్వమని అడగండి-నేరవార్తలు

* 👉కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వలస పోయే దారిలో దారుణం చోటుచేసుకుంది…👉ప్రమాదవశాత్తు వాహనాలు ఢీకొనడంతో ట్రాక్టర్ మీద ప్రయాణించే ప్రయాణికులకూ తీవ్రగాయాలు అవగా….👉ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించగా ఒకరు పరిస్థితి విషమంగా ఉంది…👉మరికొంత మంది క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

* పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైనా మీకు CI, SI పిలుస్తున్నారు రమ్మనమని మీకు ఎవరైనా కాల్ చేసినా భయపడకుండా వెంటనే సెక్షన్ 41(ఏ) కింద నోటీసు ఇస్తే నేను హాజరవుతానని చెప్పండి..!!నోటీస్ అందుకొని అప్పుడు నిర్భయంగా మనం హాజరు కావచ్చు..!!ఏడు సంవత్సరాలకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో 41(ఏ) కింద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినా సంబంధిత పోలీసు ఆధికారి మిమ్మల్ని స్టేషన్ కు పిలిచినా ఆ అధికారి ఇక జైలుకే..!!ఈ విషయం పై సుప్రీంకోర్టు సీరియస్..!!

* నాదెండ్ల బ్రహ్మం కేసు: రాష్ట్రంలో పోలీసులు ఏం ఆలోచిస్తున్నారు.. ఏం చేస్తున్నారురాష్ట్రంలో పోలీసుల తీరు సరిగ్గా లేదని హైకోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.- తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి బెయిలు పిటిషన్‌ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.- ఠాణాకు తీసుకెళ్లి కొట్టడం ఏంటిని హైకోర్ట్ మండిపడింది.

* కట్టుకున్న భార్యను రూ.లక్షకు అమ్మేసిన ఓ వ్యక్తి చివరికి పోలీసులకు చిక్కాడు. ఒడిశాలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 3నెలల క్రితం వివాహమైంది. కొన్నిరోజుల తర్వాత ఉపాధి నిమిత్తం రేవతిని తీసుకొని సరోజ్‌రాణా రాజస్థాన్‌ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనిచేసేవారు. కొన్నాళ్ల తర్వాత సరోజ్‌రాణా… ఓ కుటుంబానికి రేవతిని రూ.లక్షకు విక్రయించి స్వగ్రామానికి వచ్చేశాడు. రేవతి ఏదంటూ అతన్ని అత్తమామలు ప్రశ్నించారు. వేరే యువకుడితో వెళ్లిపోయిందని అతను బదులిచ్చాడు. వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌ చేరుకొన్న పోలీసులు రేవతిని కాపాడి గ్రామానికి తీసుకొచ్చారు. సరోజ్‌రాణాను అరెస్టు చేశారు. రేవతి మాట్లాడుతూ.. భర్త తనను అమ్మిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పనిచేయాలని చెప్పి వెళ్లిపోయాడని తెలిపింది.

* నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తారు. అవతలి వారిని రెచ్చగొడతారు.వారిని నగ్నంగా మాట్లాడమని కవ్విస్తారు. తర్వాత వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరిస్తారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 300 మందిని మోసగించారు. దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. పరువుపోతుందని భావించిన బాధితులూ మిన్నకుండిపోయినా.. ఓ చిన్న కేసులో తీగలాగితే ఈ డొంక కదిలింది. ఏడాదికి పైగా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ మోసాన్ని పోలీసులు తాజాగా గుట్టురట్టు చేశారు. ఈ కేసులో భార్యాభర్తలు సహా ఐదుగురిని తాజాగా ఘాజియాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసు వివరాలను పోలీసులు బయటపెట్టారు. యూపీలోని ఘాజియాబాద్‌కు చెందిన భార్యాభర్తలైన సప్నా గౌతమ్‌, యోగేశ్‌ ఈ కేసులో ప్రధాన నిందితులు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ తరహా మోసాలకు తెరతీశారు. ఈ జంటకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఈ మోసాలు ప్రారంభించారు. ఈ మోసంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పాత్ర. బాధితులతో వీడియో కాల్స్‌ మాట్లాడడం, మరికొందరి యువతులకు శిక్షణ ఇచ్చి వారిచేత కూడా ఇవే పనులు చేయడం సప్నా పని. బాధితుల వివరాలు, వారి ప్రదేశం, ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతాలను యోగేశ్‌ సేకరిస్తుంటాడు.

* గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరిలో నలుగురు విజయవాడ వాసులు కాగా, ఇద్దరు గుంటూరుకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా విజయవాడకు చెందిన జోగరాజు, షేక్‌ బాబు, షేక్‌ సైదా, సూర్య సురేష్‌, గుంటూరుకు చెందిన మోహన్‌ కృష్ణారెడ్డి, గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల గర్తింపు ప్రక్రియను చేపట్టారు.