NRI-NRT

అమెరికాలో “ఆప్కో” అట్లతద్ది

అమెరికాలో “ఆప్కో” అట్లతద్ది

అమెరికాలోని సెంట్రల్‌ ఒహైయోలో ఆంధ్రా పీపుల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహైయో (ఆప్కో) ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు అట్లతద్దిని వేడుకగా నిర్వహించారు. దాదాపు 60 మంది మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి శాస్త్రోక్తంగా గౌరీ పూజతో పాటు అన్ని పద్ధతులను నిష్ఠగా ఆచరించి వాయునాలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ వ్రతాన్ని పూర్తి చేశారు. చంద్రోదయం తర్వాత 30కి పైగా ఆంధ్రా వంటకాలతో విందు భోజనాన్ని అంతా ఆస్వాదించారు. అనంతరం స్టార్‌ మహిళా వినోద కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు మహిళలు విజేతలుగా నిలిచారు. అమెరికాలో ఈ విధంగా అట్లతద్ది వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత రెండేళ్లుగా ఆప్కో వినూత్న కార్యక్రమాలతో అతి తక్కువ సమయంలో తెలుగు వారికి అత్యంత చేరువైన సాంస్కృతిక సేవా సంస్థ. ఈ కార్యక్రమం ఆ సంస్థ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సుశీల ఉప్పుటూరి అధ్వరంలో విజయవంతంగా జరిగాయి. కమిటీ సభ్యులు వేణు పసుమర్తి, రవి నవులూరి, అపర్ణ సంగా, వాణి గద్దె, అనిత ఈడ్పుగంటి, ఉమ మునగాల, వీరేష్ ఊల్లిగడ్ల, రాజ బొమ్మన, వెంకట అరవీటి, నూకరాజు, లత సాదినేని, జయ యర్రంశెట్టి, మాధవి పుట్టితో పాటు పలువురు స్వచ్ఛంద సేవకులు అట్లతద్ది వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
APCO Atla Taddhi In Ohio