Politics

తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం. హైకోర్టుకు ఆనందయ్య-తాజావార్తలు

తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం. హైకోర్టుకు ఆనందయ్య-తాజావార్తలు

* తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు.కేసీఆర్ వరుసగా తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.తెరాస 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్​ మాదాపూర్​లోని హైటెక్స్​లో ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముందుగా పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు. మరోసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.

* రాజస్థాన్ రాష్ట్రం లోని మౌంట్ అబూలో సోమవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి శ్రీ దిగంబర కామత్, రాజస్థాన్ మంత్రి శ్రీ ప్రమోద్ జైన్, గుజరాత్ మంత్రి శ్రీ జీతూ భాయ్ చౌదరి, మౌంట్ అబూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు శ్రీ సుబ్బారెడ్డి కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి గుజరాత్ రాష్ట్రం అంబాజి లోని ‘అంబ’ అమ్మవారిని దర్శించుకున్నారు.

* టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంలో ఊరట లభించింది.గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీ మూసివేతకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం స్టే విధించింది.గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. రూ.50 కోట్ల జరిమానాకు సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది.సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సవాలు చేశారు.గ్రానైట్ కంపెనీలలో అవకతవకలపై విజిలెన్స్ సిఫారసులు చట్ట విరుద్ధమని ఎమ్మెల్యే గొట్టిపాటి తరపు న్యాయవాదులు వాదించారు. ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది.

* అమరావతి రాజధాని పరిధిలోని రైతులకు వార్షిక కౌలు రూ.80వేలను వారి వారి ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

* తిరుపతి మహతి కళాక్షేత్రంలో అక్టోబరు 30 మరియు 31 వ తేదీల్లో నిర్వహించనున్న గో మహా సమ్మేళనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు.

* దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు బలహీనపడటంతో ఈశాన్య రుతుపవనాల దిగువ ట్రోపోస్పియరిక్ స్థాయిలో వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

* బద్వేల్ ఉప ఎన్నికను స్థానిక పోలీసులతో నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశముందని బీజేపీ ఫిర్యాదు చేసింది

* సమాచార హక్కు చట్టము ప్రకారము సమాచారము సకాలములో అందించనందులకు మరియు రాష్ట్ర సమాచార హక్కు కమీషనరు వారి ఆదేశాలను బేఖాతరు చేసిన బాపట్ల పురపాలక సంఘం మేనేజరు చంద్ర మోహన్ కు సమాచార హక్కు కమీషన్ ఆఫీసు, మంగళగిరి వారు పదివేల రూపాయలు జరిమానా విధించింది. ఈ మేరకు సదరు మొత్తమును డిమాండ్ డ్రాఫ్ట్ రూపములో పరిహారముగా సదరు సమాచారము కోరిన వ్యక్తికి జమ చేశారు.

* జనం కోసం గుంటూరు అర్బన్ ఎస్పీ….శేభాష్ అని కొనియాడుతున్న గుంటూరు ప్రజలు .. స్వయంగా అర్బన్ ఎస్పి ఆరిఫ్ ఆఫీస్ పిటిషనర్ల దగ్గరకు వచ్చి వాళ్ల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు.

* విజయవాడ పండిత్ నెహ్రూ బస్టాండ్ లో దారుణం. ఒక సంవత్సరం పాపను బస్టాండ్ లో వదివెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు.

* ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది.తాను తయారు చేసే కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై కోర్టు విచారణ జరిపింది.ఆ దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

* ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో భాగంగా ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మిషన్​ను ప్రారంభించారు.దేశవ్యాప్తంగా అమలోకి రానున్న ఈ పథకాన్ని మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలో శ్రీకారం చుట్టారు.దీనితో పాటు మోదీ తన నియోజకవర్గం పరిధిలో రూ.5200 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించారు.దేశంలోని వైద్యారోగ్య రంగానికి మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 17,788 ఆరోగ్య కేంద్రాలు లబ్ధిపొందనున్నాయి.వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో 11,024 ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్మించనుంది.దేశంలో 5 లక్షలకుపైగా జనాభా ఉన్న అన్ని జిల్లాల్లో అత్యవసర సేవలు అందించే కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

* నీట్​లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు పీజీ కౌన్సిలింగ్‌ నిర్వహించబోమంటూ కేంద్రం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది.