Movies

శర్వానంద్‌కు రష్మిక హిట్టు గిఫ్టు ఇస్తుందా?

శర్వానంద్‌కు రష్మిక హిట్టు గిఫ్టు ఇస్తుందా?

కొంత‌కాలంగా స‌రైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ (Sharwanand). ర‌ష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్‌జోష్ మీదున్న హీరోయిన్ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇపుడీ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu) సినిమా వ‌స్తోంది. ఛ‌లో, గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ..ఇలా న‌టించిన సినిమాల‌న్నీ బాక్సాపీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించాయి. అంతేకాదు హీరోల‌కు కూడా మంచి స‌క్సెస్ తెచ్చిపెట్టాయి. మ‌రి ఫెయిల్యూర్స్ లో ఉన్న శ‌ర్వానంద్‌ను ర‌ష్మిక గ‌ట్టెక్కిస్తుందా..? అంటూ ఇపుడు తెగ చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు. ఫాలోవ‌ర్లు, పాపులారిటీ విష‌యంలో ర‌ష్మిక టాప్ ప్లేస్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టార్ హీరోయిన్ త‌న సినిమాలో ఉండ‌టం క‌లిసొస్తుంద‌న్న న‌మ్మ‌కంతో శ‌ర్వానంద్ ఉన్నాడంటూ టాక్ వినిపిస్తోంది. మ‌రి వ‌రుస‌ ప్లాపుల‌తో ఉన్న శ‌ర్వానంద్‌ను ర‌ష్మిక గ‌ట్టెక్కిస్తుందా..? లేదా చూడాలి. ఇటీవ‌లే మ‌హాస‌ముద్రం సినిమాతో మ‌రో ఫెయిల్యూర్ శర్వానంద్ ఖాతాలో ప‌డిపోయింది.