Business

2020-21 మధ్య ₹9713కోట్లు విరాళం ఇచ్చిన ప్రేమ్‌జి. అంబానీ మాత్రం…

2020-21 మధ్య ₹9713కోట్లు విరాళం ఇచ్చిన ప్రేమ్‌జి. అంబానీ మాత్రం…

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ దాతృత్వంలో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2020-21లో ఆయన రూ.9,713 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు రూ.27 కోట్లను వితరణగా అందించారు. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2021 జాబితాలో హెచ్‌సీఎల్‌ శివ్‌నాడార్‌ రూ.1,263 కోట్ల విరాళంతో రెండో స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ రూ.577 కోట్లు విరాళంగా అందించి మూడో స్థానం దక్కించుకున్నారు. కుమార మంగళం బిర్లా (రూ.377 కోట్లు) నాలుగో స్థానంలో నిలవగా, అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ (రూ.130 కోట్లు) దాతృత్వంలో 8వ ర్యాంకులో నిలిచారు. ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు నందన్‌ నీలేకని (రూ.183 కోట్లు) 5వ స్థానానికి చేరారు. ఈ విరాళాల్లో అధిక మొత్తం విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలకు వెళుతోందని హురున్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య పరిశోధకులు అనాస్‌ రహమాన్‌ జునైద్‌ వెల్లడించారు.