DailyDose

ఏలూరులో నకిలీ నోట్లు. మహిళపై కలిదిండి ఎస్సై వేధింపులు-నేరవార్తలు

ఏలూరులో నకిలీ నోట్లు. మహిళపై కలిదిండి ఎస్సై వేధింపులు-నేరవార్తలు

* వానజల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసుకొచ్చి ఇంట్లో దండెంపై వేస్తుండగా.. ఇనుప తీగకు కరెంట్‌ ప్రసారమై..తల్లి, ఆమెను రక్షించే ప్రయత్నంలో కుమారుడు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బిల్లుపాడులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..డీబీ కాలనీకీ చెందిన షేక్‌ నసీమూన్‌(44) వ్యవసాయ కూలీ. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికొచ్చాక వాన జల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసి ఇంట్లోని జీ వైరు తీగపై వేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సర్వీసు వైరు పక్కనే ఉండడంతో దీని నుంచి దండేనికి కరెంట్‌ ప్రసారమై షాక్‌కు గురైంది. ఈ క్రమంలో కిందపడినప్పుడు మట్టికుండకు తగిలి అది పగిలి నీళ్లు నేలపై పరుచుకున్నాయి. తల్లి కేక విని పెద్ద కుమారుడు, సుతారి పనిచేసే షేక్‌ సైదా(24) వచ్చి ఆమెను రక్షించేందుకు పట్టుకోగా..అతడికీ కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 15 సంవత్సరాల క్రితమే నసీమూన్‌ భర్త యాకుబ్, ఇప్పుడు పెద్ద కొడుకు దుర్మరణం చెందారు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న చిన్న కుమారుడు, మరో కూతురు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిరుపేద కుటుంబంలో తీవ్ర దుర్ఘటనతో బిల్లుపాడులో విషాదం అలుముకుంది. సంఘటనా స్థలాన్ని వైరా సీఐ జే.వసంత్‌కుమార్, తల్లాడ ఎస్‌ఐ జి.నరేష్‌ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

* కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో విషాదం…పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమ జంట…గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఇరువురుని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించిన బంధువులు.

* కృష్ణాజిల్లా కలిదండ ఎస్ ఐ మణికుమార్ పదే పదే స్టేషన్కు పిలుస్తూ సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు కొక్కిలిగడ్డ లక్ష్మీ పేర్కొంది ఈ నేపథ్యంలో ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం మంగళగిరిలోని డిజిపీ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె భర్త పై ఫిర్యాదు చేస్తే ఎస్సై మణికుమార్ తనని స్టేషన్ ఒకరోజు రాత్రంతా స్టేషన్లోనే ఉంచాడని ఆరోపిస్తోంది మీ భర్త వద్దు అంటున్నావు కదా నాతో ఉండు నిన్ను నేను ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటా అని పదే పదే ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపింది అదేమిటని అడిగితే తనపై కేసు నమోదు చేశారని తెలిపింది సి ఐ దృష్టికి తీసుకెళ్తే ఎస్సై కి మద్దతుగా మాట్లాడుతున్నారని తెలిపింది ఆమెకు న్యాయం చేసి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకునేందుకు డిజిపి ఆఫీసుకు వచ్చానని తెలిపింది శనివారం కావడంతో తో కార్యాలయానికి సెలవు అని ఫిర్యాదు సేకరించేందుకు సోమవారం రావాలని బాధితురాలిని డీజీపీ కార్యాలయ సిబ్బంది ఆదేశించారు మీడియాతో ఆమె మాట్లాడటం గమనించిన వారు ఆమెను పిలిపించి ఫిర్యాదు స్వీకరించటం గమనార్హం ఫిర్యాదుపై విచారించి ఎస్సై పై చర్యలు తీసుకుంటామని డిజిపీ కార్యాలయంలో అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపింది ఏది ఏమైనా న్యాయం చేయవలసిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదని పలువురు అంటున్నారు…!!

* ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్.ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రెస్ మీట్.బుట్టాయిగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు.ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధాని నాగరాజు అనే నింధితులు అరెస్ట్.వారి వద్ధ నుంచి 1,50,000 అసలు నోట్లు, 12,00,000 నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం.జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో దొంగనోట్ల చెలామణి చేస్తున్నట్లు పోలీసు విచారణ తేటతెల్లం.నింధితుల పై 489B, 489C, r/w 34 IPC యాక్ట్ లపై కేసు నమోదుచేసిన పోలీసులు.ఇటువంటి ఫేక్ కరెన్సీ విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మా.ప్రెస్ మీట్ లో పోలవరం డీఎస్పీ లలిత కుమారి, పోలవరం సిఐ ఎఎన్ఎన్ మూర్తి, ఎస్సై ఎ.జయబాబు మరియు బుట్టాయిగూడెం పోలీసులు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.