Food

ఇవి తాగితే హాయి హాయిగా నిద్ర

ఇవి తాగితే హాయి హాయిగా నిద్ర

పనులన్నీ ముగించుకుని అలా నడుం వాలుస్తామా.. సరిగ్గా అప్పుడే రేపటి పనులను గురించిన ఆలోచనలు వస్తుంటాయి. ఇక కంటి నిండా నిద్రేం పడుతుంది? కునుకు సరిగా లేకపోతేనేమో శరీరం రీఛార్జ్‌ కాదు. మరెలా? పడుకునే ముందు ఈ పానీయాలను ప్రయత్నిస్తే సరి!

* బాదం-పాలు: గోరువెచ్చని ఆవు పాలలో బాదం పొడిని కలిపి తాగండి. వీటిల్లో ఉండే ట్రిప్టోఫాన్‌ రక్తంలో సెరటోనిన్‌ స్థాయులను పెంచుతుంది. ఫలితంగా శరీరం సేదతీరి నిద్రలోకి జారుకుంటారు. బాదంలోని మెగ్నీషియమూ ఇందుకు సాయపడుతుంది.

* చామంతి టీ: పూర్వం దీన్ని జలుబు నుంచి ఉపశమనానికి వాడేవారు. ఇది నిద్రకూ మంచి మందు. దీనిలోని గుణాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించి నాణ్యమైన నిద్రను అందిస్తాయి.

* అశ్వగంధ: ఆయుర్వేదంలో నిద్రలేమి చికిత్సకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పొడిని పాలల్లో కలుపుకుని లేదా టీగా కాచుకునీ తీసుకోవచ్చు.

* ఆల్మండ్‌ బటర్‌, బనానా స్మూతీ: పడుకునే ముందు ఇంత హెవీ ఫుడ్డా అని ఆశ్చర్యపోకండి. వీటిల్లోని మెగ్నీషియం, మెలటోనిన్‌ సుఖనిద్రని అందిస్తాయి. ఒక అరటిపండు గుజ్జుకు కప్పు పాలు, టేబుల్‌ స్పూను ఆల్మండ్‌ బటర్‌ కలిపి మిక్సీ పట్టి తాగి చూడండి. కునుకు ఎలా పట్టిందో కూడా తెలియదట.