Food

తామర కాడ పకోడీలు

తామర కాడ పకోడీలు

వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు. వెంటనే ఆలూనో, మిర్చీనో.. సెనగ పిండిలో ముంచి బజ్జీలో, పకోడీలో వేస్తాం. ఉత్తరాదిన మాత్రం ఇలాంటి సందర్భాల్లో వేయించిన కమల్‌కక్‌డీని ఇష్టంగా తింటారు. అదేంటి అనుకుంటున్నారా? తామరపూల కాడలు ఉంటాయిగా… అవే ఈ కమల్‌కక్‌డీలు. వీటిని సన్నని స్లైసుల్లా తరిగి చిప్స్‌లా వేయించు కుంటారు. లేదంటే సెనగపిండిలో ముంచి బజ్జీల్లా వేస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే వీటితో చాలా మంది పచ్చళ్లు పెట్టుకోవడం, కూరలు వండు కోవడం సాధారణం అక్కడ. కశ్మీర్‌, పంజాబ్‌ ప్రాంతాల ప్రత్యేకం ఈ వంట.