Politics

కబడ్డీ ఆడిన రోజా. ట్రాక్టర్ నడిపిన రేణుక-తాజావార్తలు

కబడ్డీ ఆడిన రోజా. ట్రాక్టర్ నడిపిన రేణుక-తాజావార్తలు - Roja Plays Kabaddi. Renuka Chowdary Supports Amaravathi Capital.

* ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్?నెల్లూరు కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికనవంబర్ 15న మున్సిపాలిటీల్లో ఎన్నికలు, 17న ఫలితాలుకార్పొరేషన్లలో మిగిలిపోయిన డివిజన్లకు జరగనున్న ఎన్నిక?7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు జరగనున్న ఎన్నిక?12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్ లకు ఎన్నిక?మిగిలిపోయిన 533 వార్డు మెంబర్లకు జరగనున్న ఎన్నిక?గ్రామ పంచాయతీలో ఈనెల 14న ఎన్నిక, అదేరోజు కౌంటింగ్13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలకు ఎన్నిక?13 జిల్లాలో మిగిలిపోయిన 16 జడ్పీటీసీలకు ఎన్నిక?ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈనెల 16న ఎన్నికలు, 18న ఫలితాలు

* రాజధాని రైతుల మహా పాదయాత్రకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి మద్దతు పలికారు. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పాదయాత్రలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. రైతు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘అమరావతి అనే పిలుపు 683 రోజుల నుంచి నడుస్తోంది. ఈ పిలుపునకు మేమంతా స్పందించి వస్తున్నాం. రైతాంగానికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుకు రావడం కాంగ్రెస్‌ లక్ష్యం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పోరాడుతూ రైతుల వాణిని కేంద్రానికి వినిపించడానికి పూనుకొన్నాం. ఇంత మంది మహిళలు నాకు కేవలం బొట్టుపెట్టి స్వాగతం పలుకుతామంటే పోలీసులు వారిని కనీసం నిలబడనీయడంలేదు. ఏం ఫర్వాలేదు. నేనే వారికి వీరతిలకం దిద్దుతా’’ అని పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. పాదయాత్రలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రుణ ఒప్పందాల్లో గవర్నర్‌ పేరు రాయడం దుర్మార్గమన్నారు. ‘విశాఖ ఉక్కు’ రక్షణ బాధ్యత నూటికి నూరుశాతం వైకాపాదేనని, స్టీల్ ప్లాంట్‌ కోసం సీఎం జగన్‌ ఒక్కసారైనా నిరసన తెలిపారా? అని ప్రశ్నించారు. శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేశారనీ.. కానీ ఇప్పుడేమో మండలిలో ఖాళీలు భర్తీ చేయాలంటూ దిల్లీలో బతిమిలాడుతున్నారని ఆక్షేపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై ఎందుకు లేదని రఘురామ ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్లకార్డులు చూపించాలని డిమాండ్‌ చేశారు.

* అక్టోబరు 30న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా, రేపు (నవంబరు 2) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. 4 హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

* క్రమశిక్షణ, నిబద్ధత లేని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేరని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. క్రమశిక్షణతో మెలగడం కష్టమని భావించి కొందరు కులం, మతం, డబ్బుతో ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారని చెప్పారు. సోమవారం కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఎవరి వృత్తికి వారే నాయకుడని, యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ప్రజా వేదికలో మాతృభాషలో మాట్లాడటం పెంపొందించుకోవాలన్నారు.

* ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘాట్‌రోడ్ మూసివేత.ఘాట్‌ రోడ్‌ మరమ్మతులు నేపథ్యంలో మూడు రోజులు మూసివేయాలని నిర్ణయం.రాళ్లు జారిపడ కుండ పనులు .కొండపైకి వచ్చే వాహనాలు అర్జున వీధి నుంచి వెళ్లాలని సూచన.

* రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో *నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. లో సోమవారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగిన ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమని కబడ్డీ ఆడారు. క్రీడాకారుల తో కలిసి కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

* బిహార్‌ రాజధాని పట్నాలో 2013లో మోదీ ర్యాలీ సందర్భంగా జరిగిన పేలుళ్ల ఘటనలో నలుగురికి ఉరిశిక్ష పడింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. నేడు శిక్ష ఖరారు చేసింది. నలుగురికి ఉరిశిక్షతో పాటు, ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరు దోషులకు పదేళ్లు జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

* ఐదుకోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ‘అమరావతి’ ప్రతీక అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్రని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం కన్నతల్లిలాంటి భూముల్ని త్యాగం చేసి పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమంగా చంద్రబాబు దీన్ని అభివర్ణించారు.

* ఏపీలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్‌ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పంచాయతీలకు ఈనెల 14న, మున్సిపాలిటీలకు 15న, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు 16న ఎన్నికలు నిర్వహించనున్నారు.

* రాష్ట్రంలో 30లక్షలకు పైగా కాంగ్రెస్‌ సభ్యత్వాలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమని.. అన్ని వర్గాల రక్షణకు పోరాడుతున్న అగ్రనేత రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.

* అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని ఎంపీ రఘురామ ఆకాంక్షించారు. పాదయాత్రలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రుణ ఒప్పందాల్లో గవర్నర్‌ పేరు రాయడం దుర్మార్గమన్నారు. ‘విశాఖ ఉక్కు’ రక్షణ బాధ్యత నూటికి నూరుశాతం వైకాపాదేనని, స్టీల్ ప్లాంట్‌ కోసం సీఎం జగన్‌ ఒక్కసారైనా నిరసన తెలిపారా? అని ప్రశ్నించారు.

* సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. మరోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోన్న ఈ మాజీ ముఖ్యమంత్రి నుంచి వచ్చిన మాటలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కాగా, అఖిలేశ్ అజంగఢ్‌ స్థానం నుంచి అఖిలేశ్‌ యాదవ్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

* బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్రలోని కాకలు తీరిన రాజకీయ నాయకులు ఈ వివాదంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కూడా ఇందులోకి లాగారు. జయదీప్‌ రాణా అనే మాదక ద్రవ్యాల సరఫరాదారుడితో ఫడణవీస్‌ దిగిన ఫొటోను మాలిక్‌ ట్వీట్‌ చేశారు.

* డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్ ఖాన్‌ ఎట్టకేలకు గత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. నిజానికి అతడికి గురువారమే బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరుచేసినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో రెండు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఈ ఆలస్యానికి కరెంట్‌ కోతలే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు సీనియర్‌ న్యాయవాది అస్లామ్‌ మర్చెంట్‌ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

* రెండు రోజులపాటు రోమ్‌లో నిర్వహించిన జీ- 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కీలక ప్రకటన చేశారు. ‘కొవిడ్‌ మహమ్మారిని అంతం చేయడంలో వ్యాక్సిన్‌ సహయపడుతుంది. కానీ.. అన్ని రకాల మహమ్మారులు, ఆరోగ్య విపత్తులకు అంతిమ టీకా..సరైన నాయకత్వమే’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి ఇదే అత్యవసరమని తెలిపారు.