DailyDose

పోలీసులే గంజాయి స్మగ్లర్లు. బైక్‌పై శవాల రవాణా-నేరవార్తలు

పోలీసులే గంజాయి స్మగ్లర్లు. బైక్‌పై శవాల రవాణా-నేరవార్తలు

* ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో గంజాయి కలకలం.భద్రాచలం మీదుగా హైదరాబాద్ గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఎఆర్ కానిస్టేబుల్.గంజాయి తరలింపుకు ఐదు కోట్ల రూపాయల డీల్ కుదిరినట్లు సమాచారం.విచారణలో మరికొందరు ఇంటి దొంగల పేర్లు వెల్లడి.లోతుగా విచారణ జరుపుతున్న అధికారులు.

* “నకిలీ మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయిన రైతులు”: కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తుడిచేర్ల గ్రామంలో నల్లబోతుల రాముడు అనే వ్యక్తి 25 ఎకరాలు మొక్కజొన్న పంటను సాగు చేశారు విత్తనములు నందికొట్టుకురు పట్టణంలోని శ్రీ రామ సీడ్స్ షాపు నందు మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశాను సీడ్స్ రకం లక్ష్మి 49 59 రకం విత్తనాలు 50 ప్యాకెట్ ఒక ప్యాకెట్ 600 చొప్పున మొత్తం 30 వేల రూపాయలతో కొనుగోలు చేసిన పంట పొలంలో నాటి పంట చేతికి వచ్చే సమయానికి కంకి చిన్నగా రావడంతో రైతుకు పంట నష్టం జరిగింది నష్టం సుమారుగా 20 లక్షల రూపాయల దాకా ఉండడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు అందుకు నందికొట్కూరు అద కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అద సమాధానమిస్తూ ఈ విషయాన్ని జ్ద కు తెలియపరచి అదేవిధంగా శ్రీ రామ సీడ్స్ షా పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా గా నందికొట్టుకురు సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీ రామ సీడ్స్ షాపులు సీజ్ చేసి రైతుకు 20 లక్షల ఆర్థిక సాయం చేయగలరని డిమాండ్ చేశారు

* నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి యూపీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిర్మల్‌ గ్రామీణ ఎస్సై వినయ్‌ తెలిపారు.

* పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 22మంది దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. సుధోంటి జిల్లా బలోచ్‌ ప్రాంతం నుంచి పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావల్పిండి వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో తలెత్తిన సాంకేతిక సమస్యతో రోడ్డు నుంచి 500 మీటర్ల లోతులోకి పడిపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు వెల్లడించారు.

* కర్నూలు జిల్లా పాణ్యం జాతీయ రహదారిపై ఓ బైక్ వేగంగా దూసుకుపోతోంది. బైక్ పై ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అయితే అమ్మాయి పడుకున్న స్థితిలో ఉంది. చూడగానే అనుమానించిన జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసులు.. వెంటనే బైక్‌ను ఆపారు. బైక్ మీదున్న యువతిని పరిశీలించారు. ఆమె పరిస్థితిపై యువకుడిని ఆరా తీశారు. ఆ యువకుడు చెప్పిన సమాధానాలు సరిగా లేకపోవడంతో అనుమానం ఇంకా పెరిగింది. యువతిని మరింత జాగ్రత్తగా పరిశీలించారు. ఆమె శరీరంపై గాయాలను గుర్తించారు. యువకుడిని గట్టిగా నిలదీయగా తత్తరపాటుకు గురయ్యాడు. సందేహంతో ఆమె శ్వాస తీసుకుంటోందా.. లేదా.. అని చూశారు. శ్వాస ఆడటంలేదని నిర్ధరించుకున్న పోలీసులు.. అమె అప్పటికే చనిపోయినట్టు తేల్చారు. ఆ యువకుడిని ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.