Business

సిబిల్ స్కోర్ లేకుండా రుణం ఇలా పొందవచ్చు-వాణిజ్యం

సిబిల్ స్కోర్ లేకుండా రుణం ఇలా పొందవచ్చు-వాణిజ్యం

* ‘శీతాకాలంలో ఆహార కొరత రావచ్చు.. ఇళ్లల్లో నిల్వలు పెంచుకోండి’ ‘ఎవరైనా బింజ్‌ (ఎక్కువగా తిండితినే) వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తే శిక్షిస్తాం’ ఇదేదో ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్‌ ఉన్‌ ఆదేశాలు కాదు.. ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా పాలకుల ఆదేశాలు. కొవిడ్‌, శీతాకాలం దృష్ట్యా ఇలా చేస్తున్నాం అని వారు చెబుతున్నారు. వాస్తవానికి దేశ పాలకుల చిన్నచిన్న తప్పుడు నిర్ణయాలు పెను సంక్షోభాన్ని ఎలా సృష్టిస్తాయో కొవిడ్‌ వ్యాప్తితో ప్రపంచం తెలుసుకొంది. ఆ దేశంలో సమస్య ఎంతో తీవ్రంగా ఉంటేగానీ.. బాహ్య ప్రపంచానికి తెలిసేలా చిన్నచిన్న ప్రభుత్వ ప్రకటనలు వెలువడవు. తాజా ఆహార సంక్షోభం కూడా అదే కోవకు వస్తుంది. ప్రకృతి ప్రకోపం.. పాలకుల నిర్ణయాలు కలిసి అక్కడ కృత్రిమ సంక్షోభాలను సృష్టిస్తున్నాయి.

* సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలకు భారత్‌ పెట్టింది పేరు. ఓ మంచి పని చేపట్టే ముందు ముహూర్తం చూసుకొని ప్రారంభించడం ఇక్కడి ఓ ఆచారం. అయితే, పురాణాల్లో పేర్కొన్న ప్రతి విశ్వాసం, సంప్రదాయం వెనుక ఓ శాస్త్రీయ కారణమూ ఉందంటారు పెద్దలు. ఈ క్రమంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనేదే దీపావళి. భారత్‌లోని చాలా మంది ఇన్వెస్టర్లు ఈ పండుగను ప్రత్యేకంగా చూస్తారు. ఈరోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం వరిస్తుందని నమ్ముతుంటారు. స్టాక్‌ మార్కెట్‌లో కూడా ఓ ఆనవాయితీ ఉంది. ఆ రోజున ప్రత్యేక సమయంలో ‘మూరత్‌ ట్రేడింగ్‌’ను నిర్వహిస్తుంటారు. స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే… వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఏటా దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. ధనత్రయోదశి రోజు కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని ప్రజలు ఎలా ఆశపడతారో.. ఈ ట్రేడింగ్‌ కూడా అలాంటిదే. ఇక ఆ రోజు స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యాలయాలన్నీ దీపకాంతుల్లో వెలిగిపోతుంటాయి.

* ఎస్సార్‌ పవర్‌కు చెందిన 1,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను సొంతం చేసుకొనేందుకు అదానీ పవర్‌కు ఎన్‌సీఎల్‌టీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ ప్లాంటు మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఉంది. అదానీ పవర్‌ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు దిల్లీలోని ఎన్‌సీఎల్‌టీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎస్సార్‌ పవర్‌ ఎంపీ లిమిటెడ్‌పై దివాలా పరిష్కార చట్టంలోని ప్రక్రియ అమలుకానుంది. ఈ విషయాన్ని అదానీ పవర్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈపీఎంపీఎల్‌ సంస్థ 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌ నిర్వహిస్తోంది. దివాలా పరిష్కార ప్రణాళికలో ప్రస్తావించిన అన్ని నిబంధనలను అమలు చేయడంపైనే ఈ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో ఈపీఎంపీఎల్‌ కోసం అదానీ పవర్‌ బిడ్డింగ్‌ దాఖలు చేసింది. ఈ డీల్‌ సైజు రూ.2,800 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ఉండవచ్చు.

* గ‌త రెండేళ్ల‌లో వివిధ కార‌ణాల‌తో చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. క‌రోనా కార‌ణంగా ఉద్యోగం కోల్పోవ‌డం, వేత‌నంలో కోత‌లు, వైద్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, అద్దె డిపాజిట్లు, కొత్త ఉద్యోగాల వేట‌లో నైపుణ్యం పెంచే కోర్సులు చేయ‌డం ఇలా ప‌లు ర‌కాల కార‌ణాల‌తో స్వ‌ల్ప కాలిక రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. కొన్ని సంస్థ‌లు విడుద‌ల చేసిన నివేదిక‌ల ప్ర‌కారం.. 2020 నాల్గ‌వ త్రైమాసికంలో జారీ చేసిన రుణాల‌లో 60శాతం రుణాలు రూ.25వేల లోపువే కావ‌డం ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తుంది. అంతేకాకుండా 2020లో మొద‌టిసారిగా రుణం తీసుకున్న వారిలో 49శాతం మంది 30ఏళ్ల‌లోపు వారే. అలాగే గ‌త సంవ‌త్స‌రం రుణం పొందిన వారిలో మెట్రోయేత‌ర న‌గ‌రాల‌లో నివ‌సిస్తన్న‌వారు 71 శాతం ఉండ‌గా, మ‌హిళ‌లు 24శాతం మంది ఉన్నారు. ఈ నివేదిక‌ల ప్ర‌కారం యువ‌త ఇప్పుడు రుణాల వైపు ఎక్కువ‌గా చూస్తున్నారు. అలాగ‌ని రుణాల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌డానికి వీల్లేదు. వారు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకొని స‌రిదిద్దుకుంటున్నారు. ఇత‌రుల‌తో పోలిస్తే వారు ఈ విష‌యంలో జాగ్ర‌త్తగా మెలుగుతున్నారు. క్రెడిట్ నివేదిక‌లో మీ రుణ చరిత్ర‌ను గురించిన పూర్తి వివ‌ర‌ణ ఉంటుంది. రుణం సుల‌భంగా పొంద‌డం కోసం ఆరోగ్యక‌ర‌మైన క్రెడిట్ స్కోరును నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి. అందువ‌ల్ల రుణ గ్ర‌హీత క్రెడిట్ స్కోరు అంటే ఏంటి? ఎలా నిర్వ‌హించాలి? ఎంత క్రెడిట్ స్కోరు ఉంటే మంచిది? క్రెడిట్ స్కోరు త‌గ్గ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకోవాలి. సిబిల్ స్కోరు లేక‌పోయినా రుణం పొంద‌డం సాధ్య‌మే. అయితే సెక్యూర్డ్ రుణాలు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. అంటే రుణానికి బ‌దులు త‌గిన ఆస్తిని హామీగా ఉంచాలి. ఉదాహ‌ర‌ణ‌కి.. బంగారంపై రుణం పొందేందుకు రుణ గ్ర‌హీత‌కు క్రెడిట్‌స్కోరు ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి కాదు. అలాగే ఇత‌ర ఆస్తుల‌ను హామీగా ఉంచి తీసుకునే రుణాలు. అయితే ఇక్క‌డ ఒక విష‌యం గుర్తించుకోవాలి. ఇలాంటి రుణాలకు క్రెడిట్ స్కోరు అవ‌స‌రం లేక‌పోయినా తిరిగి చెల్లించ‌డంలో జాప్యం జ‌రిగితే క్రెడిట్ స్కోరు ప్ర‌భావితం అవుతుంది.

* ధ‌న‌ త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జ‌రుగుతుంద‌ని భార‌తీయులు భావిస్తారు. అలాగే పెట్టుబ‌డుల ప‌రంగా చూసినా పోర్ట్‌ఫోలియోలో బంగారం పెట్టుబ‌డులు ఉండాలి. అయితే గ‌రిష్ఠంగా 5-10 శాతం ఉంటే స‌రిపోతుంది. అంత‌కంటే ఎక్కువ‌గా బంగారం కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాదు. ఒక‌వేళ పెళ్లి కోసం ఎక్కువ బంగారం కొనుగోలు చేయాల్సి వ‌స్తే పర్వాలేదు గానీ, సాధార‌ణంగా అయితే ఎక్కువ పెట్టుబ‌డులు కేటాయించ‌క‌పోవ‌డం మంచిదని ఆర్థిక స‌ల‌హాదారులు చెప్తున్నారు. ఈ సంప్రదాయానికి తోడు త‌నిష్క్‌, జోయలుక్కాస్‌, మ‌ల‌బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ వంటి ప్రముఖ న‌గ‌ల విక్రయ సంస్థలు వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు బంగారంపై అనేక ఆఫ‌ర్లను ప్రకటిస్తున్నాయి. మ‌రి మీరు కూడా ఈ ధ‌న‌త్రయోదశికి బంగారం కొనుగోలు చేశారా? అయితే, బంగారంపై ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల‌ను తెలుసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఒక‌వేళ భ‌విష్యత్‌లో బంగారం విక్రయిస్తే దీనిపై అవ‌గాహ‌న ఉండాలి. బంగారంపై క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఏ రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారో దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. దాంతో పాటు ఎంత‌కాలం బంగారం నిల్వ ఉంచుతున్నారనే విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొనుగోలు చేసిన మూడేళ్లలోపు తిరిగి విక్రయిస్తే దాన్ని స్వల్పకాలిక, అంతకంటే ఎక్కువ కాలం అట్టిపెట్టుకుంటే దీర్ఘకాలికంగా లెక్కిస్తారు.